DJ Tillu: సిద్దు.. నేహా.. రొమాన్స్ టర్నింగ్ ఇస్తుందా?

సిద్దు జొన్నలగడ్డ.. అప్పుడెప్పుడో పదేళ్ల క్రితమే నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. నాగ చైతన్య జోష్ సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించిన సిద్దూ..

DJ Tillu: సిద్దు.. నేహా.. రొమాన్స్ టర్నింగ్ ఇస్తుందా?

Dj Tillu

Updated On : February 1, 2022 / 10:07 PM IST

DJ Tillu: సిద్దు జొన్నలగడ్డ.. అప్పుడెప్పుడో పదేళ్ల క్రితమే నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. నాగ చైతన్య జోష్ సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించిన సిద్దూ గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా మారాడు. మధ్యలో చాలా సినిమాలు చేసినా.. వర్మ ఐస్ క్రీం 2లో నటించినా పెద్దగా పేరు రాలేదు. గుంటూరు టాకీస్ సినిమా తర్వాత మూడు సినిమాలు చేసినా అవేమీ ప్రేక్షకులు గుర్తు పెట్టుకొనేంత సినిమాలు కూడా కాలేదు. కాగా ఇప్పుడు డీజే టిల్లు అని వచ్చేస్తున్నాడు.

Naresh59: అల్లరోడి కొత్త సినిమా.. మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్లే!

ఇక నేహా శర్మ కూడా అంతే. మెహబూబా, గల్లీ రౌడీ సినిమాల్లో హీరోయిన్ గానే కాకుండా ఇంకా కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన నేహాకి సరైన సక్సెస్ పడలేదు. అందుకే ఇప్పుడు మరికాస్త గ్లామర్ డోస్ పెంచేసి టిల్లు గాడితో కలిసి రచ్చ చేసేందుకు వచ్చేసింది. నిజానికి ఈ ఇద్దరూ ఇప్పటి వరకు సక్సెస్ లేని హీరో హీరోయిన్స్. కానీ.. భీమ్లా నాయక్ లాంటి సినిమాను నిర్మిస్తున్న నిర్మాత డీజే టిల్లుని నిమిస్తున్నాడు.

James: అప్పూ వస్తున్నాడు.. పునీత్ లాస్ట్ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!

ఇప్పటి వరకు డీజే టిల్లు నుండి వచ్చిన ప్రతి అప్డేట్ యూత్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. పాటలు.. అందులో రొమాన్స్.. డైలాగ్స్ ఇలా అన్నీ పక్కా యూత్ టార్గెట్ చేసి పక్కా ప్యాకేజ్ గా రెడీ చేశారు. అందుకే ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా మీద అటెన్షన్ క్రియేట్ అయింది. సినిమా ప్రమోషన్ లో కూడా కొత్తగా సినిమాలో రొమాన్స్ ను హైలెట్ చేస్తూ పబ్లిసిటీ చేస్తున్నారు. మరి రొమాన్స్ అయినా ఈ ఇద్దరికీ సక్సెస్ తెస్తుందా అన్నది చూడాలి.