Sankranthi Movies : సంక్రాంతి బరిలో డబ్బింగ్ సినిమాలు
తెలుగు చిన్న సినిమాలతో పాటు వేరే భాషల నుంచి డబ్బింగ్ సినిమాలు కూడా ఈ సారి సంక్రాంతి బరిలో నిలవనున్నాయి. జనవరి 13న తమిళ్ స్టార్ హీరో అజిత్ నటించిన 'వలిమై' సినిమా...........

Sankranthi Movies
Sankranthi Movies : ప్రతి సంవత్సరం సంక్రాంతి వచ్చిందంటే సినిమా వాళ్ళకి కూడా పండగే. స్టార్ హీరోలంతా తమ సినిమాలని సంక్రాంతి బరిలో దింపేవాళ్లు. కానీ ఈ సారి కరోనా ప్రభావంతో చాలా చోట్ల థియేటర్లు మూత పడ్డాయి. అంతేకాక ఏపీలో సినిమా టికెట్ల సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. దీంతో ఈ సంక్రాంతికి రావాల్సిన స్టార్ హీరోల సినిమాలన్నీ వాయిదా పడాయి. ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’, ‘భీమ్లానాయక్’ సినిమాలు సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాయి. దీంతో ఒక్కసారిగా చిన్న సినిమాలన్నీ తెరపైకి వచ్చాయి.
పెద్ద సినిమాలు వాయిదా వేయడంతో ఈ సారి చిన్న సినిమాలే సంక్రాంతి రేసులో నిలవనున్నాయి. అయితే తెలుగు చిన్న సినిమాలతో పాటు వేరే భాషల నుంచి డబ్బింగ్ సినిమాలు కూడా ఈ సారి సంక్రాంతి బరిలో నిలవనున్నాయి. జనవరి 13న తమిళ్ స్టార్ హీరో అజిత్ నటించిన ‘వలిమై’ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమాలో మన తెలుగు యువ హీరో కార్తికేయ విలన్ గా చేయడం విశేషం. మరో తమిళ్ హీరో విశాల్ కూడా తన సినిమా ‘సామాన్యుడు’ని జనవరి 14న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘సెల్యూట్’ సినిమా జనవరి 14న విడుదల కానుంది. వీటితో పాటు తమిళ్ హీరో కార్తీ గతంలో చేసిన ‘మద్రాస్’ సినిమాని ఇప్పుడు తెలుగులో ‘నా పేరు శివ 2’గా డబ్ చేసి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. అయితే దీని విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.
Meena : నటి మీనా ఫ్యామిలీ మొత్తానికి కరోనా..
ఇలా ఈ సంక్రాంతికి మన తెలుగు చిన్న సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా పోటీ పడనున్నాయి. మరి ఇన్ని సినిమాలలో ఈ సారి సంక్రాంతి విజేత ఎవరో చూడాలి.