Dude : ఫుట్ బాల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ప్రేమకథ ‘డ్యూడ్’..

పూర్తి ఫుట్ బాల్ నేపథ్యంలో ఇప్పటివరకు తెలుగు, కన్నడ భాషల్లో సినిమా రాలేదు. ఈ డ్యూడ్ సినిమా ఫుట్ బాల్ తో పాటు ప్రేమ కథను కూడా చూపించనుంది.

Dude : ఫుట్ బాల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ప్రేమకథ ‘డ్యూడ్’..

Dude Movie with Football and Love Content go for shoot in soon

Updated On : October 20, 2023 / 4:24 PM IST

Dude Movie : యువ కథానాయకుడు తేజ్ నటిస్తున్న ద్విభాషా చిత్రం “డ్యూడ్”. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ లో సెట్స్ కు వెళ్లనుంది. తెలుగు – కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పనరోమిక్ స్టూడియోస్ పతాకంపై తేజ్ స్వయంగా నిర్మిస్తుండడమే కాకుండా కథను అందించి, దర్శకత్వం వహిస్తుండడం విశేషం.

తేజ్ ఇంతకుముందు “రామాచారి” అనే కన్నడ హిట్ చిత్రంలో నటించారు. తేజ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం “గాడ్” కూడా త్వరలో మొదలు కానుంది. ఇప్పటివరకు కొన్ని వేల ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. కానీ పూర్తి ఫుట్ బాల్ నేపథ్యంలో ఇప్పటివరకు తెలుగు, కన్నడ భాషల్లో సినిమా రాలేదు. ఈ డ్యూడ్ సినిమా ఫుట్ బాల్ తో పాటు ప్రేమ కథను కూడా చూపించనుంది.

Also ReadRoshan Kanakala : బన్నీతో యాంకర్ సుమ కొడుకు.. పుష్ప 2 షూట్‌లో..

కర్ణాటకలోని “కిక్ స్టార్ట్” అనే సుప్రసిద్ధ ఫుట్ బాల్ క్లబ్… “డ్యూడ్” చిత్రానికి పూర్తి సహాయసహకారాలు అందిస్తోంది. డిసెంబర్ లో సెట్స్ కు వెళ్లనున్న ఈ చిత్రానికి కన్నడ – మలయాళ భాషల్లో సుపరిచితుడైన ఇమిల్ మొహమ్మద్ సంగీతం సమకూర్చుతుండగా, నాని అలా మొదలైంది చిత్రానికి ఛాయాగ్రహణం అందించిన ప్రేమ్ కెమెరా బాధ్యతలు నిర్వహించనున్నారు. రాఘవేంద్ర రాజ్ కుమార్, రంగాయన రఘు, విజయ్ చందూర్, సందీప్ మలని ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.