దమ్ముంటే నన్నాపు.. కాదు కరోనాను ఆపు..

కరోనా ఎఫెక్ట్ - ఉగాది విడుదల కావలసిన ‘వి’ చిత్రం వాయిదా..

  • Published By: sekhar ,Published On : March 14, 2020 / 08:31 AM IST
దమ్ముంటే నన్నాపు.. కాదు కరోనాను ఆపు..

Updated On : March 14, 2020 / 8:31 AM IST

కరోనా ఎఫెక్ట్ – ఉగాది విడుదల కావలసిన ‘వి’ చిత్రం వాయిదా..

కరోనా వైరస్ (కోవిడ్-19) ఎఫెక్ట్ సినిమా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పలు షూటింగులు, విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి. ఉగాదికి రిలీజ్ అవాల్సిన మూవీస్ కూడా పోస్ట్‌పోన్ అవుతున్నాయి. నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్.. ‘వి’..

క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిర ‘వి’ నాని నటిస్తున్న 25వ సినిమా.. ఇటీవల విడుదల చేసిన టీజర్, లిరికల్ సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఉగాది కానుకగా మార్చి 25న భారీగా రిలీజ్ చేయాలనుకున్నారు.

కట్ చేస్తే.. మహమ్మారి కరోనా కారణంగా థియేటర్లు మూసేయాలనే ప్రతిపాదనతో ‘వి’ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు నిర్మాత దిల్ రాజు అధికారికంగా ప్రకటిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఏప్రిల్‌లో మంచి డేట్ చూసి విడుదల చేస్తామని తెలిపారు. ఈ సినిమాకు సంగీతం : అమిత్ త్రివేది, ఆర్ఆర్ : థమన్, డీఓపీ : పిజి విందా, ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్.