Rana – Dulquer : రానా స్పీడ్ మాములుగా లేదుగా.. దుల్కర్‌తో మరో మల్టీ లాంగ్వేజ్ మూవీ..

రానా నిర్మాణంలో దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ. టైటిల్ పోస్టర్‌తోనే..

Rana – Dulquer : రానా స్పీడ్ మాములుగా లేదుగా.. దుల్కర్‌తో మరో మల్టీ లాంగ్వేజ్ మూవీ..

Dulquer Salmaan new movie Kaantha produced by Rana Daggubati

Updated On : July 28, 2023 / 8:59 PM IST

Rana Daggubati – Dulquer Salmaan : టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ప్రస్తుతం మంచి స్పీడ్ లో ఉన్నాడు. యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా వరుసపెట్టి సినిమాలు, సిరీస్ అనౌన్స్ చేస్తున్నాడు. ఇటీవల ప్రభాస్ తో పాటు అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ కామిక్ కాన్ లో పాల్గొన్న రానా.. అక్కడ తన ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేశాడు. తన సొంత నిర్మాణ సంస్థ స్పిరిట్ మీడియాలో హిరణ్యకశిపుడు (Hiranyakashyap), లార్డ్స్ అఫ్ ది డెక్కన్ (Lords Of The Deccan), మిన్నల్ మురళి (Minnal Murali) కామిక్ వెర్షన్ ని తీసుకు రాబోతున్నట్లు వెల్లడించాడు.

Ram Charan : చెప్పిన మాట పైనే ముందుకు వెళ్తున్న రామ్‌చరణ్.. కొత్త టాలెంట్ కోసం ఆడిషన్స్.. మీరూ వెళ్తారా..?

హిరణ్యకశిపుడు మూవీలో తానే టైటిల్ రోల్ పోషిస్తూ బిగ్ బడ్జెట్ మూవీగా తీసుకు రాబోతున్నాడు. ఇక లార్డ్స్ అఫ్ ది డెక్కన్ ని వెబ్ సిరీస్ గా నిర్మించబోతున్నాడు. చాళుక్య సామ్రాజ్య కథతో ఈ సిరీస్ ఉండబోతుంది. కామిక్ వెర్షన్ లో మిన్నల్ మురళిని నిర్మించబోతున్నాడు. ఈ మూడు ప్రాజెక్ట్స్ కి సంబంధించిన కాన్సెప్ట్ అండ్ అనౌన్స్‌మెంట్ టీజర్స్ ని ఒకొక్కటిగా రెండు రోజులు నుంచి రిలీజ్ చేస్తున్నాడు. తాజాగా ఇప్పుడు మలయాళ స్టార్ హీరో ‘దుల్కర్ సల్మాన్’తో సినిమా ప్రకటించాడు. ‘కాంత’ (Kaantha) అనే టైటిల్ ని ఈ మూవీకి ఖరారు చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది.

Kushi : విజయ్, సమంతల ఖుషీ మూమెంట్స్‌తో టైటిల్ సాంగ్.. పాట రిలీజ్ అయ్యింది చూశారా..?

ఈ మూవీలో దుల్కర్ నటించడమే కాదు, నిర్మాణంలో కూడా రానాతో కలిసి చేతులు కలిపాడు. వేఫేరర్ ఫిల్మ్స్ అండ్ స్పిరిటి మీడియా బ్యానర్స్ ఈ మూవీని.. తెలుగు, మలయాళ, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారు. తమిళ్ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేయబోతున్నాడు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయనున్నారు.