Ram Charan : చెప్పిన మాట పైనే ముందుకు వెళ్తున్న రామ్‌చరణ్.. కొత్త టాలెంట్ కోసం ఆడిషన్స్.. మీరూ వెళ్తారా..?
రామ్ చరణ్ తాను చెప్పిన మాట పైనే ముందుకు వెళ్తున్నాడు. తన సినిమా కోసం కొత్త టాలెంట్ కావాలంటూ ఆడిషన్స్ నోటీసు..

audition call for Ram Charan Nikhil Siddhartha The India House movie
Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా సత్తా చాటుతూ వస్తున్నాడు. ఇక ఇటీవల తన స్నేహితుడు విక్రమ్ తో కలిసి V మెగా పిక్చర్స్ అనే బ్యానర్ ని స్థాపించి.. అందులో మొదటి సినిమాని టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ నిఖిల్ (Nikhil Siddhartha) తో ప్లాన్ చేశారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ తో కలిసి ఈ సినిమాని రామ్ చరణ్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మిస్తున్నాడు. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ చేస్తూ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ వీడియో అందరిలో మంచి అంచనాలు క్రియేట్ చేసింది.
Bro Movie : మూవీలో ‘శ్యాంబాబు’ ఆ ఏపీ మంత్రినా బ్రో.. సోషల్ మీడియాలో వైరల్..!
బ్రిటిష్ రూలింగ్ సమయంలో ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ కొంతమంది.. బ్రిటిష్ గడ్డ పై ఏర్పాటు చేసిన గూఢచారి సమావేశం గృహమే ‘ఇండియన్ హౌస్’. ఆ హౌస్ నేపథ్యంతో ఈ మూవీ కథ సాగబోతోంది. ఇక ఈ చిత్రానికి ‘ది ఇండియా హౌస్’ (The India House) అనే టైటిల్ నే ఖరారు చేశారు. కాగా రామ్ చరణ్ V మెగా పిక్చర్స్ బ్యానర్ పెట్టింది కొత్త టాలెంట్ ని ప్రోత్సహించి ఇండస్ట్రీకి వద్దామనుకుంటున్నా.. కొత్తవారికి తాను అవకాశం కలిపిద్దామని. ఇప్పుడు అదే మాట పై చరణ్ అడుగులు వేస్తున్నాడు.
Mahesh – Allu Arjun : టాలీవుడ్ లో వారసుల కంటే వారసురాళ్లకే ఎక్కువ ఫాలోయింగ్.. సితార, అర్హ..!
ప్రస్తుతం ఇండియన్ హౌస్ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్.. ఈ సినిమా కోసం కొత్త నటీనటులు కావాలంటూ ఒక ఆడిషన్ నోటీసు రిలీజ్ చేశారు. 10 ఏళ్ళ వయసు నుంచి 60 ఏళ్ళ వయసు వరకు ఉన్న నటీనటులు కావాలని, ఇంటరెస్ట్ ఉన్న వాళ్ళు.. 3 ఫోటోలు మరియు ఒక నిమిషం పాటు నటించిన వీడియోని casting@agarwalarts.com కి పంపించాలని పేర్కొన్నారు. నిమిషం వీడియో అంటే రీల్స్ కాకుండా తమ టాలెంట్ చూపించేలా ఉండాలని తెలియజేశారు. మరి మీకు ఇంటరెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేసేయండి.
#IndiaHouse @AAArtsOfficial @VMegaPictures_
New Talent out there ? Idigo ?? pic.twitter.com/seqmuPPtp9— Nikhil Siddhartha (@actor_Nikhil) July 28, 2023