తమిళ హీరో కు జోడీగా తెలుగమ్మాయి !

  • Published By: veegamteam ,Published On : April 3, 2019 / 05:16 AM IST
తమిళ హీరో కు జోడీగా తెలుగమ్మాయి !

Updated On : April 3, 2019 / 5:16 AM IST

తెలుగు ఇండ‌స్ట్రీలో తెలుగు హీరోయిన్లు లేర‌నే కొర‌త‌ను కాస్తా తీర్చిన హీరోయిన్ ఈషా రెబ్బా. యాంక‌ర్‌గా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఈషా రెబ్బా త‌రువాత కాలంలో హీరోయిన్‌గా మారింది. మొద‌ట చిన్న సినిమాల‌లో హీరోయిన్‌గా చేసిన ఈషా,ఇప్పుడు పెద్ద సినిమాల‌లో కూడా హీరోయిన్‌గా న‌టిస్తోంది. గత ఏడాది ఏకంగా 5 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరోయిన్ ఈషా రెబ్బా ఈ ఏడాది కూడా జాగ్రత్తగా సినిమాలను ప్లాన్ చేసుకుంటుంది. ఇటీవలే డమరుకం ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్ లో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈషా తాజాగా మరో ఆఫర్ కు ఓకే చెప్పింది.

మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో జివి ప్రకాష్ కుమార్ కు జోడిగా తమిళంలో ఓ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈషా రెబ్బా. ఏజిల్ ఈ చిత్రాన్ని తెరక్కించనున్నాడు. ఇక ఈషా కు కోలీవుడ్ లో ఇది రెండవ సినిమా. ఇంతకుముందు ఆమె ఓయ్ అనే తమిళ చిత్రంలో నటించింది.