Bigg Boss Nonstop: ఎలిమినేషన్ నామినేషన్.. ఈ వారం లిస్టులో 8 మంది!

బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం మొదలై ఐదు వారాలు పూర్తయింది. తొలి వారం ఎలిమినేషన్ లో ముమైత్ ఖాన్ హౌస్ వీడగా..

Bigg Boss Nonstop: ఎలిమినేషన్ నామినేషన్.. ఈ వారం లిస్టులో 8 మంది!

Bigg Boss Nonstop

Updated On : April 5, 2022 / 9:52 AM IST

Bigg Boss Nonstop: బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం మొదలై ఐదు వారాలు పూర్తయింది. తొలి వారం ఎలిమినేషన్ లో ముమైత్ ఖాన్ హౌస్ వీడగా.. ఆమె గత వారమే మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇక రెండో వారం శ్రీరాపాక, మూడో వారం వారియర్స్ ఆర్జే చైతూ, నాలుగో వారం సరయు, ఐదో వారం తేజస్వి మదివాడ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఆరవ వారం నామినేషన్ ప్రక్రియ కూడా మొదలు పెట్టాడు బిగ్ బాస్.

Bigg Boss Nonstop: హాయ్‌ చెప్పడానికి బలుపేంటి.. హీరోపై అరియనా ఫైర్!

సహజంగా నామినేషన్స్ అంటేనే కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. నామినేషన్స్ లో అదే కనిపించింది. కంటెస్టెంట్ల ఫోటోలను మంటలలో పడేస్తూ.. వాళ్ళని ఎందుకు ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో కారణం చెప్పాల్సి ఉంది. ఎలాగు ఒకరు చెప్పే కారణాలను మరొకరు నచ్చదు కనుక ఇక్కడ అరుపులు, కేకలు, ఏడుపులు అబ్బో ఓ రేంజ్ పర్ఫామెన్స్ కనిపించింది.

BiggBoss NonStop : బిగ్‌బాస్‌‌పై మరోసారి ఫైర్ అయిన సిపిఐ నారాయణ

ఫైనల్ గా చూస్తుంటే ఈ వారం అజయ్‌, అషూ, మిత్ర, మహేశ్‌, హమీదా, అరియానా, నటరాజ్‌, అనిల్‌ నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మిత్రా శర్మ తొలి వారం నుండే ప్రతి వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని వార్తలు రావడం.. కానీ, ఆమె కాకుండా మరొకరి ఎలిమినేషన్ కావడం.. ఐదు వారాలుగా ఇదే జరుగుతుంది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు.. మిత్రాను ఈ వారం కూడా బిగ్ బాస్ కాపాడతాడా అన్నది చూడాల్సి ఉంది.