OG Movie : OG మూవీ సెట్స్ నుంచి ఫోటో లీక్.. నెట్టింట వైరల్..!

పవన్ కళ్యాణ్ OG మూవీ నుంచి లీక్ అయిన ఒక పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. ఆ ఫొటోలో..

OG Movie : OG మూవీ సెట్స్ నుంచి ఫోటో లీక్.. నెట్టింట వైరల్..!

Emraan Hashmi pic leak from Pawan Kalyan OG Movie sets

Updated On : September 4, 2023 / 5:36 PM IST

OG Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న గ్యాంగ్ స్టార్ మూవీ ‘OG’. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటిస్తుంటే బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి (Emraan Hashmi) విలన్ గా కనిపించబోతున్నాడు. అలాగే అర్జున్ దాస్, శ్రియారెడ్డి ప్రధాన పాత్రల్లో నటిసున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. దీంతో చిత్రీకరణను గ్యాప్ లేకుండా పూర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని ఒక ప్రత్యేక సెట్ లో జరుగుతుంది.

Pushpa 2 : పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్‌కి 1000 కోట్లు ఆఫర్ చేశారా..?

ఈ షూటింగ్ లో ఇమ్రాన్ హష్మి కూడా పాల్గొన్నాడు. తాజాగా సెట్ లో ఇమ్రాన్ హష్మికి సంబంధించిన ఒక పిక్ బయటకి వచ్చింది. దానిలో ఇమ్రాన్.. ఫుల్ గడ్డంతో టాప్ టు బోటం బ్లాక్ అవుట్ ఫిట్ లో కనిపిస్తున్నాడు. ఆ పిక్ చూసిన కొందరు నెటిజెన్స్.. గ్యాంగ్ స్టార్ కి సంబంధించిన విలన్ కూడా ఇంత రొమాంటిక్ గా ఉంటాడని ఇమ్రాన్ హష్మిని చూశాకే అర్ధమవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇమ్రాన్ హష్మి.. ఒకప్పుడు రొమాంటిక్ పాత్రలతో మంచి ఫేమ్ ని సంపాదించుకున్న విషయం తెలిసిందే.

Kushi Collections : మూడు రోజుల్లో 70 కోట్లు.. దూసుకుపోతున్న ఖుషి.. విజయ్ సినిమాకు 100 కోట్లు గ్యారెంటీ..

డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాది చివరిలో గాని, 2024 సంక్రాంతిలో గాని రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. కాగా ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆడియన్స్ లో ఓ రేంజ్ అంచనాలను క్రియేట్ చేసింది. ముఖ్యంగా గ్లింప్స్ కి థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఆ గ్లింప్స్ ఫుల్ ఆడియో ట్రాక్ ని కూడా మేకర్స్ అభిమానుల కోసం రిలీజ్ చేశారు.