ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో వారానికో సినిమా…OTTలను మించిపోయే కంటెంట్

  • Published By: sekhar ,Published On : July 25, 2020 / 05:47 PM IST
ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో వారానికో సినిమా…OTTలను మించిపోయే కంటెంట్

Updated On : July 25, 2020 / 6:07 PM IST

కాంట్రవర్శీ కింగ్ రామ్ గోపాల్ వర్మకు తన సినిమాలను ఎలా పబ్లిసిటీ చేసుకోవాలి? జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయాలి అనేది వోడ్కాతో పెట్టిన విద్య. ఇప్పుడు సరికొత్త బిజినెస్ స్ట్రాటజీకి తెర లేపాడు వర్మ.

ఆర్జీవీ ‘పవర్‌స్టార్’ తరువాత సినిమా సెలబ్రిటీల కాంట్రావర్సీ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టరు కానీ, కామా పెడతారు. ఆయన లిస్ట్‌లో అమృత‌పై తీస్తున్న ‘మర్డర్’ సినిమా ఒక్కటే కాంట్రావర్సీ.‘కరోనా, ఎన్ఎన్ఎన్ 2’లతో వివాదమేవీ లేవు. ఆయన మైండ్ లో చాలా సినిమాలున్నాయి. అందుకే… వారానికి ఒక సినిమా తన ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో వదలాలి అన్నది ఆర్జీవీ టార్గెట్.

సినిమా అంటే రెండుగంటల అన్న కాన్సెప్ట్ ఆర్జీవిదికాదు. తక్కువ నిడివితో ఉండేలా, తన అసిస్టెంట్లతో స్క్రిప్ట్ వర్క్, డైరెక్షన్ చేయించి వీలైనంత త్వరగా పూర్తి చేస్తారు. ప్రతి శుక్రవారం ఓ కొత్త సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది ఆర్జీవీ ఆలోచన. ప్రస్తుత పరిస్థితుల్లో ఆడియెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఓటీటీలపై ఆధారపడ్డారు. సినిమాకు రూ.150 నుండి 200 వరకు టికెట్ రేట్ కూడా ఫిక్స్ చేసి, ఎలా చూసుకున్నా తను సేఫ్ అయ్యేలా సూపర్ ప్లాన్ వేశాడు

బాలీవుడ్‌ను ఏలుతున్న సమయంలో Ram gopal Varma Factoryలో వారానికో సినిమా రిలీజ్ చేయాలనుకున్నారు. వారానికి కాకపోయినా నెలకో సినిమా చొప్పున రిలీజ్ చేశారు. ఆ టెక్నిక్ బాగానే పనిచేసింది. కొంత క్వాలిటీ తగ్గినా…వరుస సినిమాలతో మూవీ ఇండస్ట్రీ గ్రామర్ ను మార్చేశారు. ఇప్పుడు మళ్లీ అదే టెక్నిక్ తో మూవీస్‌ను రెడీ చేస్తున్నారు. గతంలో థియేటర్లు, డిస్ట్రిబ్యూషన్ గొడవ ఉండేది. ఈసారి అంతా యాప్. ఓటీటీలో వచ్చే సినిమాల కన్నా….ఎక్కువ సినిమాలను www.rgvworldtheatre.com లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే మూడు సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్నాయి.