Sai Dharam Tej పెళ్లికి అంతా రెడీ.. వధువు ఎవరో..

‘నో పెళ్లి దాన్-తల్లి, ఈ తప్పే చేయకురా వెళ్లి‘ అని సాంగ్ చేసిన Sai Dharam Tej రూట్ మార్చాడు. ఆ సాంగ్ లో కనిపించిన రానా ముందు పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడు అయిపోతే అదే ఫాలో అయిపోతున్నాడు సాయి ధరమ్ తేజ్.
ఇంట్లో వాళ్లు చూసి, సెట్ చేసిన అమ్మాయినే సాయితేజ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిసింది. ముందుగా సాయితేజ్ ఫ్యామిలీ చూసిన తరువాత సంబంధానికి మేనమామ మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు కూడా ఉన్నాయట.
ఈ అక్టోబర్-నవంబర్ నెలల్లో పెళ్లికి ఒకే అనుకుంటే.. సరైన ముహుర్తాలు లేక వచ్చే ఏడాది 2021 వేసవిలో పెళ్లి వుండే అవకాశం వుందని తెలుస్తోంది. ఇంకా కాబోయే వధువు పేరు త్వరలోనే మీ అందరి ముందుకు..
కాగా.. సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ మూవీ కూడా ‘సోలో బతుకే సో బెటర్‘.