Pushpa Movie : ‘పుష్ప’ రాజ్ ఊరమాస్ సాంగ్ వచ్చేస్తోంది..

‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ సాంగ్‌లో ఐకాన్ స్టార్ సందడి ఎలా ఉండబోతోందో ప్రోమోతో హింట్ ఇచ్చారు..

Pushpa Movie : ‘పుష్ప’ రాజ్ ఊరమాస్ సాంగ్ వచ్చేస్తోంది..

Eyy Bidda

Updated On : November 16, 2021 / 6:50 PM IST

Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’ (ది రైజ్).. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నాయి. రష్మిక మందన్న కథానాయిక.. వెర్సటైల్ మలయాళీ యాక్టర్ ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నెగిటివ్ రోల్స్ చేస్తున్నారు.

Rashmika Mandanna : కోట్లు కోట్లు బొగ్గుకే ఖర్చు పెట్టెయ్యండి..

ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్లకు, మూడు పాటలకు రెస్పాన్స్ ఏ స్థాయిలో వచ్చిందనేది కొత్తగా చెప్పక్కర్లేదు. మంగళవారం సాయంత్రం నాలుగో పాట ప్రోమో వదిలారు. ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ అంటూ సాగే ఈ సాంగ్ సాలిడ్ మాస్ మసాలా సాంగ్ అని.. ఇది తన ఫేవరెట్ అని బన్నీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

Samantha : ‘పుష్ప’ ఐదో పాట అదిరిపోద్దంతే.. సమంత ఐటమ్ సాంగ్ కన్‌ఫామ్

మంగళవారం సాయంత్రం ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ సాంగ్ ప్రోమో వదిలారు. ఐకాన్ స్టార్ ఫుల్ ఊరమాస్‌గా అలరించబోతున్నాడనే హింట్ ఇచ్చారు ప్రోమోతో. పూర్తి పాట నవంబర్ 19 ఉదయం 11:07 గంటలకు విడుదల చెయ్యబోతున్నారు.

Pushpa The Rise : బన్నీ రంగంలోకి దిగితే కానీ.. డిస్ట్రిబ్యూటర్ మాట వినలేదు..

బన్నీ – సుక్కు – దేవి కాంబినేషన్ అనగానే అంచనాలు ఎలా ఉంటాయో ‘ఆర్య’, ‘ఆర్య 2’ సినిమాలు ప్రూవ్ చేశాయి. వాటిని మించి ఈ ‘పుష్ప’ ఆల్బమ్ ఉంటుందని కాన్ఫిడెంట్‌గా చెప్తోంది మూవీ టీం. డిసెంబర్ 17న ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ Pushpa The Rise ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.