F3 for RRR: ఆర్ఆర్ఆర్ ఎఫ్3 త్యాగం.. దిల్ రాజు క్లారిటీ!

సంక్రాంతికి రావాల్సిన ఎఫ్3 కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది.

F3 for RRR: ఆర్ఆర్ఆర్ ఎఫ్3 త్యాగం.. దిల్ రాజు క్లారిటీ!

Rrr

Updated On : January 30, 2022 / 1:02 PM IST

F3 for RRR: 2021 సంక్రాంతికి రావాల్సిన ఎఫ్3 కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. షూటింగ్‌లకు అంతరాయం కారణంగా రిలీజ్ డేట్ కూడా ప్రకటించడం లేట్ అయ్యింది.

ఎట్టకేలకు పరిస్థితులు అనుకూలించి షూటింగ్ పూర్తి కాగా.. ఈ సినిమాని 2022 ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఆర్ఆర్ఆర్ సినిమాను మార్చిలో కానీ, ఏప్రిల్‌లో కానీ విడుదల చేస్తామని ఆ చిత్రయూనిట్ ప్రకటించింది.

ఈ క్రమంలో ఎఫ్‌3ని అవసరమైతే మళ్లీ వాయిదా వేస్తామని ప్రకటించారు ఆ చిత్రనిర్మాత దిల్ రాజు. సంక్రాంతి సందర్భంగా జనవరి 7వ తేదీన రిలీజ్‌ కావాల్సిన ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా సినిమా కరోనా వల్ల వాయిదా పడింది.

ఆర్ఆర్ఆర్ సినిమాని కొవిడ్ పరిస్థితులు సద్దుమణిగితే మార్చి 18న కుదరని పక్షంలో ఏప్రిల్‌ 28వ తేదీన రిలీజ్‌ చేస్తామని ప్రకటించింది చిత్రయూనిట్. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కోసం ఎన్టీఆర్‌, మెగా అభిమానులు మూడేళ్లుగా వెయిట్ చేస్తున్నారు.