Fahadh Faasil comments about Allu Arjun winning national award
Pushpa 2 : అల్లు అర్జున్ హీరోగా ఫహాద్ ఫాజిల్ విలన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం పుష్ప 2. మొదటి భాగం చివరిలో ఎంట్రీ ఇచ్చి కొంత సమయమే కనిపించిన ఫహాద్ ఫాజిల్.. తన రోల్ క్యారక్టరైజేషన్ అండ్ యాక్టింగ్ తో ఆడియన్స్ లో బలమైన ముద్ర వేశారు. దీంతో సెకండ్ పార్ట్ లో ఆయన రోల్ ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకుంది. రీసెంట్ ఇంటర్వ్యూలో ఫహాద్ పుష్ప 2లో తన రోల్ ఎలా ఉంటుందో చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఫహాద్ ఫాజిల్ తాను నటించిన ‘ఆవేశం’ సినిమా ప్రమోషన్స్ లో ఉన్నారు. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఫహాద్ ఫాజిల్‌ని ప్రశ్నిస్తూ.. “పుష్ప 2లో మీ పాత్ర ఉండబోతుందా..?” అని అడిగారు. ఇక దీనికి ఫహాద్ బదులిస్తూ.. “క్రూరంగా లేదా భయంకరంగా ఉంటుందని చెప్పలేను. కానీ నా పాత్ర కొత్తరకంగా డిఫరెంట్ గా ఉంటుంది” అని చెప్పుకొచ్చారు.
Also read : Venkatesh : చిరుతో పోటీ ప్రకటించి.. నారీ నారీ నడుమ మురారి అంటున్న వెంకీ మామ..
ఇక ఇదే ఫహాద్ కి మరో ప్రశ్న కూడా ఎదురైంది. ‘ఈమధ్య విలన్ పాత్రలు ఆడియన్స్ కి బాగా రీచ్ అవుతున్నాయి. ఈక్రమంలోనే పుష్ప అండ్ నాయకుడు సినిమాల్లో ఫహాద్ చేసిన విలన్ రోల్స్ హీరోల పాత్ర కంటే ఎక్కువుగా ఆడియన్స్ కి రీచ్ అయ్యాయి. ఇది మీరు ఎలా తీసుకుంటున్నారు’ అని ప్రశ్నించారు. దానికి ఫహాద్ బదులిస్తూ.. “పుష్పలో నా పాత్ర కంటే అల్లు అర్జున్ పాత్ర, అతని మ్యానరిజమ్స్ ఎక్కువ పాపులారిటీని అందుకుంది. అందుకనే అల్లు అర్జున్ నేషనల్ కూడా అందుకున్నారు” అంటూ చెప్పుకొచ్చారు.
#FahadhFaasil responds to the question of – Is Shekhawat character more cruel in #Pushpa2TheRule :
” It is in a different track, not the kind of cruelness or something, it is way more interesting ”@alluarjun #PushpaMassJaathara #Aavesham pic.twitter.com/3FDrQJxhys
— Adopted Son Of Kerala (@ASOKERALA) April 9, 2024
ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా పుష్ప 2 సినిమా ఆగష్టు 15న రిలీజ్ కాబోతుంది. ఫహాద్ తో పాటు సునీల్, అనసూయ, ధనంజయ కూడా నెగటివ్ రోల్స్ లో కనిపించనున్నారు.