Venkatesh : చిరుతో పోటీ ప్రకటించి.. నారీ నారీ నడుమ మురారి అంటున్న వెంకీ మామ..

అనిల్ రావిపూడి సినిమాతో చిరుతో పోటీ ప్రకటించి.. నారీ నారీ నడుమ మురారి అంటున్న వెంకీ మామ.

Venkatesh : చిరుతో పోటీ ప్రకటించి.. నారీ నారీ నడుమ మురారి అంటున్న వెంకీ మామ..

Venkatesh announce his third movie with Anil Ravipudi

Updated On : April 9, 2024 / 6:48 PM IST

Venkatesh : విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతికి ‘సైంధవ్‌’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. వెంకటేష్ 75వ సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో దగ్గుబాటి ఫ్యాన్స్ కొంచెం నిరాశ చెందారు. అయితే వారిని ఉత్సాహపరిచేందుకు వెంకీ మామ.. సూపర్ హిట్ కాంబోతో వచ్చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో F2, F3 సినిమాలు చేసి వరుస సక్సెస్ లు అందుకున్న వెంకీ.. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం మరోసారి అనిల్ తో జతకట్టారు.

గత రెండు సినిమాలను మల్టీస్టారర్ గా తీసుకు వచ్చిన ఈ కాంబో.. ఈసారి మల్టీ హీరోయిన్ పిక్చర్ గా తీసుకు రాబోతున్నారు. మాజీ ప్రియురాలు, భార్య మధ్య నలిగిపోయే భర్తగా వెంకటేష్ కనిపించబోతున్నారు. నారీ నారీ నడుమ మురారిగా ఇబ్బంది పడే ఓ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ చుట్టూ జరిగిన ఒక క్రైమ్ థ్రిల్లర్ తో అనిల్ రావిపూడి ఈ సినిమాని తెరకెక్కిచాబోతున్నారట.

Also read : Vijay Antony : ‘లవ్ గురు’ చూసి భార్యని ప్రేమించడం ఎలాగో తెలుసుకుంటారు.. బిచ్చగాడు 3 వచ్చేది అప్పుడే..

F2, F3 సినిమాలను నిర్మించిన దిల్ రాజు.. ఈ మూవీని కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని అనౌన్స్ చేయడమే కాదు, రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించేసారు. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. కాగా వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో ఆల్రెడీ చిరంజీవి బెర్త్ బుక్ చేసుకొని ఉన్నారు. ‘విశ్వంభర’ సినిమాతో చిరంజీవి సంక్రాంతికి రాబోతున్నారు.

ఇప్పుడు వెంకటేష్ కూడా సంక్రాంతికే వస్తానంటూ ప్రకటించి చిరుతో పోటీకి సిద్ధమయ్యారు. మరి ఇద్దరి సీనియర్ హీరోలతో పాటు ఇంకెంతమంది సంక్రాంతి బరిలో చేరుతారో చూడాలి.