Vijay Antony : ‘లవ్ గురు’ చూసి భార్యని ప్రేమించడం ఎలాగో తెలుసుకుంటారు.. బిచ్చగాడు 3 వచ్చేది అప్పుడే..
'లవ్ గురు' సినిమా చూస్తే భార్యని ప్రేమించడం ఎలాగో తెలుసుకుంటారు అంటున్న విజయ్ ఆంటోనీ. అలాగే బిచ్చగాడు 3 సినిమా అప్డేట్ ని కూడా ఇచ్చారు.

Vijay Antony interesting comments about Love Guru Bichagadu 3 movies
Vijay Antony : తమిళ్ హీరో విజయ్ ఆంటోని తెలుగులో కూడా మంచి ఫేమ్ ని సంపాదించుకున్నారు. దీంతో ఆయన సినిమాలకు ఇక్కడ కూడా మంచి మార్కెట్ క్రియేట్ అయ్యింది. అందుకనే ఆయన నటించిన అన్ని సినిమాలకు తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ‘లవ్ గురు’ అనే సినిమాతో రాబోతున్నారు. మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 11న రిలీజ్ కాబోతుంది. దీంతో విజయ్ ఆంటోనీ తెలుగు మీడియాకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
విజయ్ ఆంటోనీ ఈ సినిమాతో తొలిసారి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఈ మూవీ ఫెంటాస్టిక్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ అని విజయ్ చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఈ సినిమా చూసిన తరువాత భార్యని ప్రేమించడం ఎలాగో తెలుసుకుంటారు అనే వెల్లడించారు. ప్రేమ అనేది ఇచ్చుపుచ్చుకునే లావాదేవీ కాదని, ఇతరులు మనల్ని ప్రేమించినా, ప్రేమించకున్నా మనం ప్రేమించడమే నిజమైన ప్రేమ.
Also read : Jabardasth : కోపంతో జబర్దస్త్ నటుడిని తిట్టేసిన ఇంద్రజ.. కానీ స్టేజిపై క్షమాపణలు చెప్పి..
అదే ఈ సినిమాలో చూపించబోతున్నట్లు పేర్కొన్నారు. తాను ఎన్ని సినిమాల్లో నటించినా బిచ్చగాడు అంత ఎమోషనల్ హైని ఇవ్వలేనని, అయితే బిచ్చగాడుతో పోల్చి చూస్తే.. లవ్ గురు కనీసం 80 శాతం ఎమోషనల్ హైని ఇవ్వగలదని, ఇందులో కూడా లేడీస్ సెంటిమెంట్ ఉంటుందని విజయ్ ఆంటోనీ చెప్పుకొచ్చారు. లవ్ గురు అనే టైటిల్ సినిమాలోని ఓ పాత్ర గురించి పెట్టింది కాదని, ఈ సినిమా ప్రేమించడం ఎలాగో నేర్పిస్తుందట. అందుకే మూవీకి లవ్ గురు అనే టైటిల్ ని పెట్టినట్లు చెప్పుకొచ్చారు.
ఇక తెలుగు ఆడియన్స్ చూపిస్తున్న అభిమానం గురించి మాట్లాడుతూ.. “నాకు మెమొరీ పవర్ చాలా తక్కువ. అందుకే తెలుగు భాష నేర్చుకోలేకపోతున్నాను. ఒకవేళ నాకు తెలుగు వస్తే, చెన్నై వదిలేసి ఇక్కడికి వచ్చి తెలుగు సినిమాల్లో నటిస్తాను” అంటూ చెప్పుకొచ్చారు. అలాగే బిచ్చగాడు 3 గురించి మాట్లాడుతూ.. “ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఆ సినిమాని నేనే డైరెక్ట్ చేయాలని అనుకుంటున్నాను. 2026 సమ్మర్ లో ఆ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తాను” అంటూ పేర్కొన్నారు.