Angry Rantman : 27ఏళ్ల వయసులోనే యూట్యూబర్ యాంగ్రీ రాంట్‌మన్‌ మృతి.. అసలు ఏమైంది..?

27ఏళ్ల వయసులోనే యూట్యూబర్ యాంగ్రీ రాంట్‌మన్‌ మృతి చెందాడు. అసలు అతను ఎలా చనిపోయాడు..?

Angry Rantman : 27ఏళ్ల వయసులోనే యూట్యూబర్ యాంగ్రీ రాంట్‌మన్‌ మృతి.. అసలు ఏమైంది..?

Famous Youtuber Angry Rantman alias Abhradeep Saha is pased away

Angry Rantman : యాంగ్రీ రాంట్‌మన్‌గా నెట్టింట ఫేమ్ ని సంపాదించుకున్న యూట్యూబర్ ‘అబ్రదీప్ సాహా’. క్రికెట్, ఫుట్‌బాల్ మరియు ఇతర క్రీడలతో పాటు సినిమాల పై కూడా తనదైన శైలిలో రివ్యూలు ఇస్తూ సోషల్ మీడియా మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. కాగా ఈ యూట్యూబర్ గత కొంతకాలంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడట.

కొన్ని నెలలు క్రితం తీవ్రమైన అనారోగ్యంతో బెంగళూరులోని నారాయణ కార్డియాక్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి అక్కడ హార్ట్ సర్జరీ చేయించుకున్నాడు. దీంతో నెలరోజుల పాటు సోషల్ మీడియాలో సాహా ఇన్‌యాక్టివ్‌గా ఉన్నాడు. ఈ చికిత్స గురించి సాహా తండ్రి సోషల్ మీడియా ద్వారా నెటిజెన్స్ కి తెలియజేసాడు. త్వరలోనే తన కొడుకు మళ్ళీ తిరిగి వస్తాడని చెప్పుకొచ్చాడు.

Also Read : Nabha Natesh : ప్రభాస్ వాయిస్‌తో డబ్‌స్మాష్ చేసిన నభా నటేష్.. వీడియో వైరల్..

కానీ వారం రోజుల క్రితం సాహా మళ్ళీ తీవ్రమైన అనారోగ్యానికి గురవ్వడంతో.. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో వెంటిలేషన్ మీద ఉంచారు. ఇక రెండు రోజుల క్రితం చికిత్సకు స్పందించడం మానేసిన సాహా.. 27 ఏళ్ల వయసులో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో మరణించినట్లు సమాచారం. అతి చిన్న వయసులోనే సాహా తుది శ్వాస విడవడంతో నెటిజెన్స్ అంతా విచారం వ్యక్తం చేస్తున్నారు.

కాగా అబ్రదీప్ సాహా తన వైవిధ్యమైన వ్యాఖ్యాన శైలితో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అభిమానులు సంపాదించుకున్నాడు. అతని యూట్యూబ్‌ ఛానెల్ ‘యాంగ్రీ రాంట్‌మాన్’కి 481K పైగా సబ్‌స్క్రైబర్లు మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో 119K ఫాలోవర్లు ఉన్నారు.