Gautham Menon : గౌతమ్ మీనన్‌ని ఒక అమ్మాయి అడిగిన ప్రశ్న.. వైరల్ అవుతున్న సమాధానం..

మీరు పూర్తి చేసిన ప్రయాణంలో నా జీవితం చాలా చేంజ్ అయ్యింది. మీ లైఫ్ ఎంతలా మారింది అంటూ ఒక అమ్మాయి దర్శకుడు గౌతమ్ మీనన్‌ని అడిగిన ప్రశ్న..

Gautham Menon : గౌతమ్ మీనన్‌ని ఒక అమ్మాయి అడిగిన ప్రశ్న.. వైరల్ అవుతున్న సమాధానం..

Fan Girl tweet for Gautham Menon on Dhruva Natchathiram

Updated On : October 25, 2023 / 8:54 PM IST

Gautham Menon : తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్‌.. లవ్ అండ్ థ్రిల్లర్ రెండు జోనర్స్ లో సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తూ ఉంటాడు. తెలుగులో కూడా పలు సినిమాలు డైరెక్ట్ చేసిన ఈ దర్శకుడు సినిమాలు కోసం ఇక్కడ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేసిన కొత్త సినిమా ‘ధ్రువ నక్షత్రం’ ఇప్పుడు రిలీజ్ కి సిద్దమవుతుంది. ఈ సినిమాని గౌతమ్ మీనన్ పదేళ్ల క్రిందటే అనౌన్స్ చేశాడు. అయితే హీరో మారడం, బడ్జెట్, కరోనా వంటి ప్రాబ్లెమ్స్ తో ఈ మూవీ లేట్ అవుతూ వచ్చింది.

రెండు పార్ట్స్ గా తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ నవంబర్ 24న రిలీజ్ కాబోతుంది. దసరా నాడు మూవీ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇది ఇలా ఉంటే, ఈ మూవీ గురించి ఒక అమ్మాయి, గౌతమ్ మీనన్ కి ఒక ట్వీట్ చేసింది. “నేను సెకండ్ ఇయర్ చదువుతున్న సమయంలో మీరు ధ్రువ నక్షత్రం అనౌన్స్ చేశారు. ఇప్పుడు నేను ఒక ఎంఎన్‌సి కంపెనీలో మూడు సంవత్సరాల అనుభవంతో పని చేస్తున్నాను. ఈ సినిమా రిలీజ్ చేసేలోపు మీ లైఫ్ ఎలా చేంజ్ అయ్యింది” అంటూ గౌతమ్ మీనన్ ని ప్రశ్నించింది.

Also read : Venkatesh : వెంకటేష్ కూతురి నిశ్చితార్థం.. చిరు, మహేష్ ఫోటోలు వైరల్..

ఇక దీనికి గౌతమ్ మీనన్ బదులిస్తూ.. “ఈ గ్యాప్ లో నేను చాలా నేర్చుకున్నాను. అలాగే మూడు సినిమాలను డైరెక్ట్ చేసి రిలీజ్ చేసేశాను. నాలుగు అంథాలజీ షార్ట్ ఫిలిమ్స్ చేశాను, ఐదు మ్యూజిక్ వీడియోస్ చేశాను. అలాగే నా ఆలోచన శక్తిని కూడా పెంచుకున్నాను” అంటూ బదులిచ్చాడు. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన కొందరు నెటిజెన్స్.. ‘మీరు ఈ గ్యాప్ లో ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రలు, ప్రధాన పాత్రలు కూడా పోషించారు’ అంటూ గుర్తు చేస్తున్నారు.