Prabhas : ఓరి మీ దుంపలుతెగ.. ప్రభాస్ పెళ్లి చేసుకోవడం లేదని.. అభిమానులు ఏం చేశారో చూశారా..?

ప్రభాస్ పెళ్లి విషయమై ఏం చెప్పడం లేదని, అభిమానులు చేసిన ఒక పనికి నెటిజెన్స్.. 'ఓరి మీ దుప్పలుతెగ' ఏం క్రియేటివిటీ రా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Prabhas : ఓరి మీ దుంపలుతెగ.. ప్రభాస్ పెళ్లి చేసుకోవడం లేదని.. అభిమానులు ఏం చేశారో చూశారా..?

Fans creating Prabhas Anushka Shetty family photo with AI

Updated On : October 6, 2023 / 12:59 PM IST

Prabhas : ప్రభాస్ అభిమానులు అతని సినిమాలు కోసం ఎంత ఆశగా ఎదురు చూస్తుంటారో.. ప్రభాస్ పెళ్లి వార్త కోసం కూడా అంటే ఆశగా చూస్తుంటారు. కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి అనే మాట కూడా ఎత్తకుండా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. కాగా ప్రభాస్ పెళ్లి పై అనేక రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అనుష్క శెట్టి, కృతి సనన్ తో ప్రేమ అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ వాటిలో నిజం లేదని.. ప్రభాస్ తో పాటు ఆ ఇద్దరు యాక్ట్రెస్ లు కూడా తెలియజేశారు.

అయితే అభిమానులు మాత్రం.. ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఆశ పడుతుంటారు. ప్రభాస్ అండ్ అనుష్క కలిసి ఇప్పటికి నాలుగు సినిమాల్లో నటించారు. ఆన్ స్క్రీన్ ఈ జంట ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఈ బంధాన్ని చూసిన అభిమానులు.. వీరిద్దరూ కలిసి ఉంటే ఇంకా బాగుంటుందని ఆశ పడుతుంటారు. అయితే ప్రభాస్ పెళ్లి విషయమై ఏం చెప్పడం లేదని, అభిమానులు చేసిన ఒక పనికి నెటిజెన్స్.. ‘ఓరి మీ దుంపలుతెగ’ ఏం క్రియేటివిటీ రా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also read : Hi Nanna : ప్రతి కూతురు కోసం నాన్న పాట.. అంటూ ‘హాయ్ నాన్న’ సాంగ్ రిలీజ్ చేసిన మహేష్ బాబు..

ఇంతకీ అభిమానులు చేసిన పని ఏంటంటే.. ప్రస్తుతం AI టెక్నాలజీ ఉపయోగించి నెటిజెన్స్ ఏవేవో అద్భుతాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే ప్రభాస్ అభిమానులు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సహాయం తీసుకోని అనుష్కతో ప్రభాస్ కి పెళ్లి చేసేశారు. అయితే పెళ్లితో మాత్రమే ఆగలేదు.. వారిద్దరికీ ఒక పాపని కూడా పుట్టించేశారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను #Pranushka అంటూ వైరల్ చేస్తున్నారు. ఇక వీటిపై మీమర్స్ ఫన్నీ మీమ్స్ చేస్తుండగా.. అవి చూసిన ఫాలోయర్స్ నవ్వుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by JABARDAST.MEMES (@jabardast__memes)

 

View this post on Instagram

 

A post shared by BSUA? (@basic_sense_undadhu_andi)