Prabhas – Faria Abdullah : కల్కి సెట్‌లో ప్రభాస్ సార్ నన్ను చూసి.. అలా అనేసరికి నేను షాక్.. మాకు కూడా ఫుడ్..
ప్రభాస్ కల్కి సినిమాలో ఓ పాటలో ఫరియా అబ్దుల్లా కనిపించి అలరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దాని గురించి మాట్లాడింది.
Prabhas – Faria Abdullah : జాతిరత్నాలు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయింది ఫరియా అబ్దుల్లా. ఆ తర్వాత హీరోయిన్ గా సినిమాలు చేసుకుంటూ వస్తుంది. అప్పుడప్పుడు పలు సినిమాల్లో గెస్ట్ రోల్స్ కూడా చేస్తుంది. ప్రభాస్ కల్కి సినిమాలో ఓ పాటలో ఫరియా అబ్దుల్లా కనిపించి అలరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దాని గురించి మాట్లాడింది.
Also Read : Pranitha Subhash : డెలివరీ అయి కొన్ని రోజులైంది.. రెండో సారి తల్లి అయిన హీరోయిన్.. స్పెషల్ పోస్ట్ వైరల్..
ఫరియా అబ్దుల్లా త్వరలో మత్తు వదలరా 2 సినిమాతో రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. కల్కి సినిమాకు నాలుగు రోజులు షూట్ చేసాము. ఆ పాటలో నన్ను సెంటర్ లో పెట్టి షూట్ చేయడం, ఆ మేకప్, ఆ అనుభవం అంతా బాగుంది. ప్రభాస్ సార్ చాలా సింపుల్ గా ఉంటారు, అందరితో బాగా మాట్లాడతారు. ప్రభాస్ సర్ నన్ను సెట్ లో చూడగానే.. హే ఫరియా ఎలా ఉన్నావు అని అడిగారు. నన్ను ఎవరో పరిచయం చేయబోతుంటే తను నాకు తెలుసు అన్నారు. వెంటనే నేను షాక్ అయ్యాను. ఆ తర్వాత గుర్తొచ్చింది జాతిరత్నాలు ట్రైలర్ లాంచ్ కి ప్రభాస్ గారి దగ్గరికి వెళ్లి ఫుల్ ఫన్ చేశామని. ఇంకా నన్ను గుర్తుంచుకున్నారు. తరవాత షూట్ గ్యాప్ లో నేను రాసిన ర్యాప్ సాంగ్స్ వినిపించాను. ప్రభాస్ గారు నువ్వు ర్యాప్ సాంగ్స్ కూడా రాస్తావా అని మెచ్చుకున్నారు. మాకు కూడా ఫుడ్ బాగా తెప్పించారు, చాలా ఐటమ్స్ తెప్పించారు, వాటన్నిటిని చూసి తినకుండా ఉండలేకపోయాము. మా అమ్మ సెట్స్ కి వస్తే అమ్మతో కూడా జోక్స్ వేశారు అని తెలిపింది.