Pranitha Subhash : డెలివరీ అయి కొన్ని రోజులైంది.. రెండో సారి తల్లి అయిన హీరోయిన్.. స్పెషల్ పోస్ట్ వైరల్..
తాజాగా రెండోసారి బాబు జన్మించినట్టు ప్రణీత అధికారికంగా ప్రకటించింది.
Pranitha Subhash : హీరోయిన్ ప్రణీత తాజాగా రెండోసారి తల్లి అయింది. తెలుగు, కన్నడలో పలు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రణీత కరోనా సమయంలో కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి 2022 లో మొదటిసారి పాప జన్మించింది. తాజాగా రెండోసారి బాబు జన్మించినట్టు ప్రణీత అధికారికంగా ప్రకటించింది.
Also Read : Vinayaka Chavithi Song : వినాయకచవితికి కొత్త సాంగ్.. మంగ్లీ పాటకు వరలక్ష్మి శరత్ కుమార్ స్టెప్పులు అదుర్స్..
కొన్ని నెలల క్రితం తాను ప్రగ్నెంట్ అని ప్రకటించి పలు బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసిన ప్రణీత తాజాగా హాస్పిటల్ లో డెలివరీ తర్వాత తన భర్త, తన బాబుతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసి.. కొత్త అడ్వెంచర్ మొదలైంది. మా అబ్బాయి డెలివరీ అయి ఆల్రెడీ కొన్ని రోజులైంది. ఇవి నా జీవితంలో మ్యాజికల్ డేస్ అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఈ జంటకు అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.