Vinayaka Chavithi Song : వినాయకచవితికి కొత్త సాంగ్.. మంగ్లీ పాటకు వరలక్ష్మి శరత్ కుమార్ స్టెప్పులు అదుర్స్..
ఈ సారి వినాయకచవితికి ఓ మూవీ యూనిట్ తమ సినిమాలోని వినాయకుడి పాటని విడుదల చేసింది.
Vinayaka Chavithi Song : మరో రెండు రోజుల్లో వినాయకచవితి వస్తుండటంతో అంతటా వినాయకచవితి హడావిడి కనిపిస్తుంది. పండగ వచ్చిందంటే ప్రతి సంవత్సరం స్పెషల్ పాటలు కూడా వస్తాయని తెలిసిందే. అయితే ఈ సారి వినాయకచవితికి ఓ మూవీ యూనిట్ తమ సినిమాలోని వినాయకుడి పాటని విడుదల చేసింది.
పరుచూరి బ్రదర్స్ మనవడు సుదర్శన్ పరుచూరి హీరోగా ‘మిస్టర్ సెలబ్రిటీ’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు. తాజాగా ఈ సినిమా నుంచి వినాయకుడి సాంగ్ రిలీజ్ చేసారు. సినిమాలో వినాయకచవితి నేపథ్యంలో ‘గజానన..’ అంటూ సాగే ఓ ఫాస్ట్ బీట్ వినాయక సాంగ్ ఉంది. దాని వీడియో సాంగ్ ని తాజాగా రిలీజ్ చేసారు.
Also Read : Sai Pallavi Dance : చెల్లి పెళ్ళిలో సాయి పల్లవి డ్యాన్స్ చూశారా? బామ్మ, చెల్లితో కలిసి అదరగొట్టేసిందిగా..
గణేష్ ఈ పాటకు లిరిక్స్ రాయగా వినోద్ సంగీత దర్శకత్వంలో మంగ్లీ ఈ పాటని పాడింది. మంగ్లీ పాడిన పాటకు వరలక్ష్మి శరత్ కుమార్ అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్ అదరగొట్టింది. ఈసారి వినాయక మండపాల దగ్గర ఈ గజానన సాంగ్ బాగానే వినపడేలా ఉంది. మీరు కూడా ఈ వినాయకచవితి స్పెషల్ సాంగ్ వినేయండి..