Maruva Tarama : ఆకట్టుకుంటున్న ‘మరువ తరమా’ ఫస్ట్ లుక్ పోస్టర్..
ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో రాబోతున్న 'మరువ తరమా' సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.

Feel good love story Maruva Tarama first look poster released
Maruva Tarama : ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ లో ఉన్న ఆ ఫీల్ యూత్ మెప్పు పొందుతూ ఉంటుంది. డిఫరెంట్ కంటెంట్ తో నడిచే ఫీల్ గుడ్ సినిమాలకు యూత్ పట్టం కడుతుంటారు. ఇప్పటికే ఇలాంటి ఎన్నో స్టోరీస్ బాక్సాఫీస్ దుమ్ముదులిపాయి. ఇదే బాటలో ఇప్పుడు మరో ఫీల్ గుడ్ మ్యూజికల్ లవ్ స్టోరీ ‘మరువ తరమా’ రాబోతోంది. అద్వైత్ ధనుంజయ హీరోగా అతుల్యా చంద్ర, అవంతిక నల్వా హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ మీద గిడుతూరి రమణ మూర్తి, రుద్రరాజు విజయ్ కుమార్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహించారు.
Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ షెడ్యూల్ షురూ.. యాక్షన్ పార్ట్!
ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తూనే ప్రమోషన్స్ చేపడుతున్న ‘మరువ తరమా’ చిత్ర యూనిట్.. ఇప్పటికే టైటిల్ లుక్ రిలీజ్ చేసి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఇదే జోష్ లో తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ప్రేమలో ఉన్న కుర్రాడి ఫీలింగ్స్ తెలిసేలా ఉన్న ఈ పోస్టర్ తొలి చూపులోనే యూత్ ఆడియన్స్ మనసు దోచేసేలా ఉంది. పోస్టర్ లో బ్యాక్ గ్రౌండ్ ఆర్ట్ హైలైట్ గా నిలిచింది.
Vikram : విక్రమ్‌కి షూటింగ్స్‌లో పదేపదే ప్రమాదాలు.. ఆ యాక్సిడెంట్ మాత్రం ఒక పీడకల.. ఏమైందో తెలుసా?
ఈ ఏడాదిలో ప్రేమను నింపేందుకు మరువ తరమా అనే చిత్రం రాబోతోందని మేకర్లు తెలిపారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న యూనిట్.. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. కొత్త సంవత్సరం ప్రారంభంలో ఈ మూవీ టైటిల్ లోగోను విడుదల చేసి భేష్ అనిపించుకున్నారు. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని, మిగతా వివరాలను ప్రకటించనున్నట్టు మేకర్లు తెలిపారు. ఈ సినిమాలోని తొలి పాటను మే 5న రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు.
ఈ చిత్రానికి విజయ్ బుల్గనిన్ సంగీతాన్ని అందించారు. రుద్ర సాయి కెమెరామెన్‌గా, కె.ఎస్.ఆర్ ఎడిటర్‌గా వ్యవహరించారు. అద్వైత్ ధనుంజయ , అతుల్యా చంద్ర, అవంతిక నల్వా ముఖ్య పాత్రల్లో నటించారు.

Feel good love story Maruva Tarama first look poster released