RRR : కుప్పంలో తారక్, చెర్రీ అభిమానుల మధ్య గొడవ.. థియేటర్ వద్ద టికెట్లు చింపేసిన ఫ్యాన్స్

కొన్ని చోట్ల మాత్రం అభిమానుల మధ్య గొడవలు తలెత్తుతున్నాయి. బ్యానర్స్, టికెట్స్ లాంటి కొన్ని విషయాల్లో ఈ గొడవలు జరుగుతున్నాయి. తాజాగా నిన్న రాత్రి చిత్తూరు జిల్లా కుప్పంలో ఇద్దరు....

Rrr Tikets

 

RRR :  రాజమౌళి దర్శకత్వంలో తారక్, చెర్రీలతో భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ‘ఆర్ఆర్ఆర్’ మానియానే కనిపిస్తుంది. ఫ్యాన్స్ ప్రేక్షకులు నుంచి సెలబ్రిటీల వరకు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే పలు చోట్ల బెనిఫిట్ షోలు కూడా పడ్డాయి. చాలా మంది అభిమానులు, సెలబ్రిటీలు కూడా బెనిఫిట్ షోలకు టికెట్స్ బుక్ చేసుకొని వెళ్లారు.

అయితే ఇద్దరు స్టార్ హీరోలని పెట్టి సినిమా తీయాలంటే ఎంతో గట్స్ ఉండాలి. ఏ మాత్రం అటు ఇటు అయినా అభిమానుల మధ్య గొడవలు తలెత్తే అవకాశం ఉంది. అయితే రాజమౌళి మాత్రం స్టార్ డం పక్కన పెట్టి యాక్టర్స్ గా మాత్రమే చెర్రీ, తారక్ లని తీసుకొని సినిమా చేశాను అని పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. సినిమా చూస్తే కానీ ఆ విషయం అర్ధం అవ్వదు. ఫ్యాన్స్ మధ్య గొడవలు రాకుండా ఉండటానికి చెర్రీ, తారక్ లు కలిసి ఇంటర్వ్యూలు ఇస్తూ, కామెడీ జనరేట్ చేస్తూ ఒకరికొకరు తమ స్నేహం గురించి చెప్తూ ప్రమోట్ చేశారు.

RRR : భ్రమరాంబ థియేటర్లో మెగా ఫ్యామిలీతో కలిసి బెనిఫిట్ షో చూసిన రాజమౌళి, చెర్రీ

అయితే కొన్ని చోట్ల మాత్రం అభిమానుల మధ్య గొడవలు తలెత్తుతున్నాయి. బ్యానర్స్, టికెట్స్ లాంటి కొన్ని విషయాల్లో ఈ గొడవలు జరుగుతున్నాయి. తాజాగా నిన్న రాత్రి చిత్తూరు జిల్లా కుప్పంలో ఇద్దరు హీరోల అభిమానుల మధ్య గొడవలు జరిగాయి. కుప్పంలో మూడు థియేటర్లలో బెనిఫిట్ షో వేస్తుండటంతో దానికి ముద్రించిన టికెట్స్ పై ఓ హీరో అభిమాన సంఘం పేరు ఉండటంతో గొడవ మొదలైంది. ఓ హీరో అభిమాన సంఘం వారు షోని కొనుక్కొని వేస్తుండటంతో ఆ హీరో పేరు ముద్రించి టికెట్స్ ఇవ్వడంతో మరో హీరో అభిమానులు ఆగ్రహించి ఆ టికెట్లని చింపి థియేటర్ ముందే పడేశారు.

RRR : మహేష్‌బాబు థియేటర్లో ఫ్యామిలీతో కలిసి సినిమా చూసిన ఎన్టీఆర్

ఈ క్రమంలో ఇరు హీరోల అభిమానుల మధ్య గొడవ మొదలైంది. అభిమానుల ఘర్షణ అనంతరం కొంతమంది పెద్దలు వీరికి సర్ది చెప్పారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చెర్రీ, తారక్ లు కలిసి ఉన్నట్టు మనం కూడా కలిసి ఉండాలని వారికి హితబోధ చేశారు.