Devara vs Game Changer : దేవర, గేమ్‌ ఛేంజర్‌ మూవీస్‌ మధ్య యుద్ధం ?

టాలీవుడ్‌లో దేవర, గేమ్‌ ఛేంజర్‌ మూవీస్‌ మధ్య యుద్ధం జరుగుతుందా?

Devara Vs Game Changer

టాలీవుడ్‌లో దేవర, గేమ్‌ ఛేంజర్‌ మూవీస్‌ మధ్య యుద్ధం జరుగుతుందా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ మధ్య సోషల్‌ మీడియాలో జరుగుతున్న రచ్చ.. రెండు సినిమాల మధ్య యుద్ధ వాతావరణాన్ని క్రియేట్‌ చేస్తోందంటున్నారు. ఇద్దరు హీరోలు మంచి స్నేహితులుగా కొనసాగుతుండగా, ఫ్యాన్స్‌కు ఎందుకీ గోల అంటారా?

సోషల్‌ మీడియాలో జూనియర్‌ ఎన్టీఆర్‌, రామచరణ్‌ అభిమానుల మధ్య ఎప్పటి నుంచో వార్‌ నడుస్తోంది. ఐతే ఈ వార్‌కు ఇద్దరు హీరోల మధ్య కోల్డ్‌వారే కారణమని ఫిల్మ్‌ నగర్‌ సమాచారమట. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ మధ్య ట్రిపుల్‌ ఆర్‌ మూవీ నుంచే గొడవలు ఉన్నాయని ఫ్యాన్స్‌ వాదిస్తున్నారు. ఇద్దరు హీరోలు ఎంతో స్నేహంగా మెలుగుతున్నా, ఈ ఫ్యాన్స్‌ మాత్రం గొడవలు సృష్టించేలా కొత్త కొత్త వివాదాలు వెలికి తీస్తున్నారంటున్నారు. తాజాగా సెప్టెంబర్‌ 27 శుక్రవారం విడుదలవుతున్న దేవరను టార్గెట్‌ చేస్తూ గేమ్‌ ఛేంజర్‌ సినిమాలో రెండో పాట ప్రోమో రిలీజ్‌ను సాకుగా తీసుకున్నారు. ఎన్టీఆర్‌ మూవీ దేవరపై ప్రేక్షకుల దృష్టి మరల్చడానికే గేమ్‌ ఛేంజర్‌ యూనిట్‌ 28న ప్రోమో విడుదలకు ప్లాన్‌ చేసిందని వాదిస్తున్నారు.

Rajamouli : ‘పుష్ప‌2’ సెట్‌లో రాజ‌మౌళి..

దేవర మూవీపై అటెన్షన్‌ను మరల్చడానికే హీరో రామ్‌చరణ్‌, డైరెక్టర్‌ శంకర్‌ గేమ్‌ ఛేంజర్‌ సెకండ్‌ సాంగ్‌ ప్రొమో రిలీజ్‌ డేట్‌ను 28వ తేదీకి ఫిక్స్‌ చేశారంటున్నారు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌. ఐతే ఇదే సమయంలో దేవర రిలీజ్‌ సందర్భంగా ఎన్టీఆర్‌కు విసెస్‌ చెబుతూ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు రామ్‌చరణ్‌. ఈ ట్వీట్‌ ద్వారా తమ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని ఫ్యాన్స్‌కు సందేశమిచ్చారు. కానీ, సోషల్‌ మీడియా వేదికగా ఇద్దరు అభిమానులు మాత్రం తగ్గేదేలే అన్నట్లు వివాదం కొనసాగిస్తూనే ఉన్నారు.

ఇక ఎన్టీఆర్‌ మూవీ దేవర పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలవుతుంది. ఎన్టీఆర్‌ సోలోగా నటించిన తొలి పాన్‌ ఇండియా మూవీ దేవర మాత్రమే. అదేవిధంగా రామ్‌చరణ్‌ నటిస్తున్న గేమ్‌ ఛేంజర్‌ కూడా మూడు భాషల్లో విడుదల కానుంది. తెలుగు, తమిళ్‌, హిందీల్లో చిత్రీకరిస్తున్న గేమ్‌ ఛేంజర్‌ డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.

Game Changer :’ రా మ‌చ్చా మ‌చ్చా’ సాంగ్‌.. సింగిల్ డాన్స్ సీక్వెన్స్‌తో దుమ్ము రేపిన రామ్‌చ‌ర‌ణ్‌.. 1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులు