చెన్నైలో సంచలనం : రజినీ, అజిత్ ఫ్యాన్స్ వీధి ఫైటింగ్స్

వేలూరు సిటీలోని ఒక థియేటర్ దగ్గర రజినీ, అజిత్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ జరిగింది.

  • Published By: sekhar ,Published On : January 10, 2019 / 07:53 AM IST
చెన్నైలో సంచలనం : రజినీ, అజిత్ ఫ్యాన్స్ వీధి ఫైటింగ్స్

వేలూరు సిటీలోని ఒక థియేటర్ దగ్గర రజినీ, అజిత్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ జరిగింది.

అభిమానం వెర్రితలలు వెయ్యడం అంటే ఏంటో, ఒక్కోసారి హద్దులు దాటి అభిమానులు చేసే పనులు చూస్తే అర్థమవుతుంది. రీసెంట్‌గా కన్నడ రాకింగ్ స్టార్ యష్ ఫ్యాన్ ఒకతను, యష్‌కి బర్త్‌డే విషెష్ చెప్పడానికి అతని సెక్యూరిటీ లోపలికి వెళ్ళనివ్వలేదని, పెట్రోల్ పోసుకున్న సంగతి మర్చిపోక ముందే, తమిళనాడులో రజినీకాంత్, అజిత్ ఫ్యాన్స్ పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. తమిళనాట, సూపర్ స్టార్ రజినీకాంత్ పేట్టా, తళ అజిత్ విశ్వాసం సినిమాలు, భారీపోటీ మధ్య సంక్రాంతికి కానుకగా ఈరోజు (జనవరి10) గ్రాండ్‌గా రిలీజ్ అయ్యాయి. కొన్ని చోట్ల పక్కపక్క థియేటర్స్‌లోనే ఈ రెండు సినిమాలు ఆడుతుండడంతో, ఇరు హీరోల అభిమానులు గొడవలకు దిగారు.

ఇక, వేలూరు సిటీలోని ఒక థియేటర్ దగ్గర రజినీ, అజిత్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ జరిగింది. ఒకరినొకరు కత్తులతో పొడుచుకున్నారు. గాయపడ్డ వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఊహించిన ఈ సంఘటనతో అభిమానులు, పోలీసులు షాక్ అయ్యారు. ఈ రెండు సినిమాలకూ పాజిటివ్ టాక్ వచ్చింది. అయినా తమ హీరో గొప్ప అంటే, తమ హీరో గొప్ప అంటూ ఫ్యాన్స్ ఘర్షణకు దిగడంతోనే గొడవ పెద్దదైందని స్థానికులు చెప్తున్నారు. దాడికి పాల్పడ్డ కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.