Film Federation: రెండ్రోజులు డెడ్‌లైన్.. షూటింగ్స్ అన్నీ ఆపేస్తాం.. చిరంజీవి టచ్‌లోనే ఉన్నారు.. కానీ.. వల్లభనేని అనిల్ కీలక కామెంట్స్..
సినీ కార్మికుల పొట్ట కాలితే వాళ్లే తిరిగి వస్తారని కొందరు నిర్మాతలు వ్యాఖ్యానిస్తున్నారు. వేతనాలు పెంచమంటే నిర్మాతలకు స్కిల్స్ గుర్తొచ్చిందా అంటూ వల్లభనేని అనిల్ ప్రశ్నించారు.

Film Federation President Anil
Film Federation President Anil: ఫిలిం ఫెడరేషన్ నాయకులతో ఫిల్మ్ ఛాంబర్ జరిపిన చర్చలు విఫలం కావడంతో సినీ కార్మికుల నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నిరసనలో 24క్రాప్ట్ విభాగాల సభ్యులు పాల్గొంటున్నారు. అయితే, తాజాగా ఫెడరేషన్ కార్యాలయం దగ్గర ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక కామెంట్స్ చేశారు. మా సమస్యలు పరిష్కారం కాకపోతే చాంబర్‌ను ముట్టడిస్తాం.. నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.
నిర్మాతలకు నచ్చిన టైంలో ఉన్న కాల్షీట్స్‌కు కార్మికులు పని చేయాలని అంటున్నారు. మాకు నచ్చిన వారిని తీసుకుంటామని చెబుతున్నారు. అలాగే ఒకరిద్దరు నిర్మాతలు స్కిల్స్ లేవని కార్మికులను అవమానిస్తున్నారని వల్లభనేని అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సినీ కార్మికుల పొట్ట కాలితే వాళ్లే తిరిగి వస్తారని కొందరు నిర్మాతలు వ్యాఖ్యానిస్తున్నారు. వేతనాలు పెంచమంటే నిర్మాతలకు స్కిల్స్ గుర్తొచ్చిందా అంటూ అనిల్ ప్రశ్నించారు. మేము గొంతమ్మ కోర్కెలు కోరడం లేదు.. ప్రతీయేటా 10శాతం చొప్పునే పెంచమంటున్నాం. నిర్మాతలు మూడేళ్లకు 15శాతం, ఐదు శాతం చొప్పున పెంచుతామన్నారు. అదికూడా అన్ని యూనియన్లకు పెంచమని అంటున్నారు. కేవలం 1500 లోపు వాళ్లకు మాత్రమే వేతనాలు పెంచుతామని, ఆపైన ఉన్నవారికి వేతనాలు పెంచమని అంటున్నారు. వేతనాలు అందరికీ సమానంగా పెంచాలని కోరాం.
షూటింగ్స్ నిలిపివేతపై మేం మూడు నెలల ముందే సమాచారం ఇచ్చాం. మూడేళ్లకు ఓసారి మాత్రమే వేతనాలు పెంచాలని అడుగుతున్నాం. కానీ, కొందరు.. కార్మికులను విడగొట్టాలని చూస్తున్నారు. కార్మికులతో పని చేయించుకోవాలి.. వారికి వేతనాలు ఇవ్వాలి. కానీ, కార్మిక సంఘాలను విడగొట్టాలని చూస్తే ఊరుకోమని అనిల్ అన్నారు. కార్మిక పక్షం నిలిచిన మంత్రి కోమటిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
షెడ్యూల్‌లో ఉన్న షూటింగ్స్‌కు రెండు రోజులు గడువు ఇస్తున్నాం. ఆ తరువాత అన్ని షూటింగ్స్ ఆపరేస్తామని అనిల్ చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి టచ్ లోనే ఉన్నారు.. కానీ, మేము ఫిలించాంబర్‌తో మాత్రమే మాట్లాడతాం. మా డిమాండ్లు పరిష్కరించకుంటే చాంబర్ వద్దే తేల్చుకుంటాంమని వల్లభనేని అనిల్ స్పష్టం చేశారు. సినీ కార్మికులు అందరూ ఐక్యతగా ముందుకు వెళ్దాం. నిర్మాతల బుట్టలో ఏ కార్మిక సంఘం పడొద్దు.. అందరం కలిసి పోరాడదామని కార్మిక సంఘాలకు పిలుపునిచ్చారు.
ఎల్లుండి లేబర్ కమిషన్ ఆఫీసుకు మేము.. నిర్మాతలు వెళ్తాం. మా సమస్య పరిష్కారం కాకపోతే చాంబర్ ను ముట్టడించి నిరాహార దీక్ష చేస్తాం. షూటింగ్స్ అన్నీ కూడా ఆపేస్తాం. చాంబర్ లో అంతర్గత గొడవలకు కార్మికుల వేతనాలను అడ్డం పెట్టుకుంటున్నారని భావిస్తున్నాం.
నిర్మాత విశ్వప్రసాద్ నోటీసు ఎందుకు పంపారో తెలియదు. నేరుగా పంపే అధికారం లేనందున ఫిల్మ్ చాంబర్ కు నోటీసులు పంపిస్తాం. నిర్మాత విశ్వప్రసాద్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు వచ్చే వరకు ఆయన సినిమా షూటింగ్ లకు హాజరుకాబోము. చాంబర్ నిర్ణయం మేరకే తుది కార్యాచరణ ఉంటుంది అని మీడియా సమావేశంలో ఫెండరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ స్పష్టం చేశారు.