Film Nagar: ఫిల్మ్‌నగర్‌లో సినిమా షూటింగ్‌లో అగ్నిప్రమాదం
హైదరాబాద్ నగరంలోని ఫిల్మ్ నగర్‌లో గురువారం(12 ఆగస్ట్ 2021) ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Agni
Film Nagar: హైదరాబాద్ నగరంలోని ఫిల్మ్ నగర్‌లో గురువారం(12 ఆగస్ట్ 2021) ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫిల్మ్ నగర్‌లో ఓ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తు జనరేటర్ వాహనంలో మంటలు అంటుకుని అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడడంతో రోడ్డు పక్కనే ఉన్న కారు, షాపులకు మంటలు వ్యాపించాయి.
ఈసమయంలో కారు పూర్తిగా దగ్ధమవగా.. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. జనరేటర్ వాహనంలో డీజిల్ లీక్ కావడంతో ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనతో షూటింగ్‌కు అంతరాయం ఏర్పడింది. అయితే ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో చిత్రయూనిట్ మొత్తం ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు.