MAA Elections: ‘మా’ ఎన్నికల బరిలో వీరే.. ఫైనల్ లిస్ట్ ఇదే!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు అక్టోబరు 10వ తేదీన జరగబోతున్నాయి.

Vishnu Prakash
MAA Elections: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు అక్టోబరు 10వ తేదీన జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే “మా” ఎన్నికల్లో అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ఖరారైంది. అభ్యర్థుల లిస్ట్‌ను విడుదల చేసిన మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్.. మా అధ్యక్ష బరిలో మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ఉన్నట్లు ప్రకటించారు.
మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి బాబుమోహన్, శ్రీకాంత్ పోటీ పడుతున్నారు. మా అసోసియేషన్‌లో రెండు వైస్ ప్రెసిడెంట్ పదవులకు బెనర్జి, హేమ, మాదాల రవి, పృథ్వీరాజ్ పోటీ పడుతున్నారు. “మా” అసోసియేషన్ లో జనరల్ సెక్రటరీ పదవికి జీవిత రాజశేఖర్, రఘుబాబు పోటీ పడుతున్నారు.
మా అసోసియేషన్‌లో కోశాధికారి పదవికి శివబాలాజీ, నాగినీడు పోటీ పడుతున్నారు. రెండు జాయింట్ సెక్రటరీ పదవులకు ఉత్తేజ్, అనితా చౌదరి, బచ్చల శ్రీనివాస్, గౌతమ్ రాజ్, కళ్యాణి పోటీ పడుతున్నారు. మా ఎన్నికలు అక్టోబర్ 10వ తేదీన జరగబోతున్నాయి.
ప్రధాన కార్యదర్శి రేసు నుంచి తప్పుకుంటున్నట్టు బండ్ల గణేష్ ప్రకటించగా.. తన ప్యానెల్ మేనిఫెస్టోను కూడా విడుదల చేసి రేసులో ఉన్నానంటూ సంకేతాలు పంపిన నటుడు సీవీఎల్ నరసింహారావు మధ్యాహ్నానికి మనసు మార్చుకుని, ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.