Pushpa The Rise : బన్నీ రంగంలోకి దిగితే కానీ.. డిస్ట్రిబ్యూటర్ మాట వినలేదు..

‘పుష్ప’ మూవీ హిందీ వెర్షన్ రిలీజ్‌కి లైన్ క్లియర్ అయ్యింది..

Pushpa The Rise : బన్నీ రంగంలోకి దిగితే కానీ.. డిస్ట్రిబ్యూటర్ మాట వినలేదు..

Allu Arjun

Updated On : November 14, 2021 / 4:17 PM IST

Pushpa The Rise: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న హ్యట్రిక్ సినిమా ‘పుష్ప’ (ది రైజ్ – పార్ట్ -1).. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నాయి. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది..

Pushpa The Rise : ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ అంటున్న అల్లు అర్జున్..

వెర్సటైల్ మలయాళీ యాక్టర్ ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్, ధనుంజయ్ తదితరులు నెగిటివ్ రోల్స్ చేస్తున్నారు. పుష్ప రాజ్ ఇంట్రో వీడియో, క్యారెక్టర్ల తాలుకు పోస్టర్లు, మూడు పాటలు ఓ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చెయ్యడమే కాక సినిమా మీద అంచనాలు మరింత పెంచేశాయి.

Balakrishna – Koratala Siva : సెన్సేషనల్ కాంబినేషన్!

పాన్ ఇండియా లెవల్లో ఐదు భాషల్లో రిలీజ్ చెయ్యాలనుకున్నారు. అయితే గతకొద్ది రోజులుగా హిందీ డిస్ట్రిబ్యూటర్ విషయంలో సందిగ్ధత నెలకొంది. బన్నీ సినిమాలకి హిందీ డబ్బింగ్ (యూట్యూబ్‌లో) మంచి రికార్డ్ ఉంది. థియేటర్స్‌లో రిలీజ్ చేస్తే ప్రేక్షకులు హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో చూడరంటూ డిజిటల్ రైట్స్ కొన్న వ్యక్తితో పాటు డిస్ట్రిబ్యూటర్
థియేట్రికల్ రిలీజ్‌ విషయంలో ఆలోచిస్తున్నారు.

Sai Dharam Tej : సెవన్ ఇయర్స్ ఫర్ సుప్రీం హీరో..

దర్శక నిర్మాతలు హిందీ డిస్ట్రిబ్యూటర్‌తో సంప్రదింపులు జరిపినా వీలు పడలేదు. దీంతో నేరుగా ఐకాన్ స్టార్ రంగంలోకి దిగి.. డిస్ట్రిబ్యూటర్‌తో మాట్లాడారు. దీంతో అతను హిందీలో సినిమా రిలీజ్ చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. డిసెంబర్ 17న ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ Pushpa The Rise ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

BEAST Movie : ఎగ్ లేకుండా ఆమ్లెట్ వేస్తుందంట!