Viral News : ఈ ఫోటోలో ఉన్న ప్రముఖ నటి కూతుర్ని గుర్తు పట్టగలరా?

ఈ ఫోటోలో ఉన్నది ప్రముఖ నటి కూతురు. ఇటీవల స్టేజ్‌పై ప్రదర్శన ఇస్తూ అందర్నీ ఆకట్టుకుంది. ఆమె ఎవరో కనిపెట్టగలరా?

Viral News : ఈ ఫోటోలో ఉన్న ప్రముఖ నటి కూతుర్ని గుర్తు పట్టగలరా?

Viral News

Updated On : December 17, 2023 / 1:11 PM IST

Viral News : ఇటీవల బాలీవుడ్ కపుల్ ఐశ్వర్య-అభిషేక్‌ల కూతురు ఆరాధ్య స్కూల్ యానివర్సరీ వేడుకలు జరిగాయి. ఆరాధ్య స్టేజ్‌పై ప్రదర్శన ఇస్తుంటే ఐశ్వర్య ఎంతో ముచ్చటగా తన కూతురికి వీడియో తీస్తూ కనిపించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

Naa Saami Ranga : నాగార్జున ‘నా సామిరంగ’ టీజర్ రిలీజ్.. ఒకే సినిమాలో ముగ్గురు హీరోలు.. అదిరిపోయిన సర్‌ప్రైజ్

టాప్ స్టార్స్ ఇంట్లో పుట్టింది. తాత-నానమ్మతో పాటు తల్లిదండ్రులు సూపర్ స్టార్స్. ఇక జీన్స్‌లో నటన ఉండకుండా ఉంటుందా? ఇదంతా చెబుతున్నది ఐశ్వర్యారాయ్-అభిషేక్ బచ్చన్‌ల గారాలపట్టి ఆరాధ్య బచ్చన్ గురించి. రీసెంట్‌గా ఆరాధ్య తన స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో వేదికపై ప్రదర్శన ఇస్తున్న వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో ఐశ్వర్య కూతుర్ని చూసి మురిసిపోతూ వీడియోలు తీయడం కనిపించింది. తమలోని కళలను పిల్లలు కూడా పుణికిపుచ్చుకుంటే ఏ పేరెంట్స్ కైనా సంబరపడే సందర్భం కదా. అక్కడ అదే కనిపించింది.

ఆరాధ్య ప్రదర్శనపై తాత అమితాబ్ బచ్చన్ కూడా తన బ్లాగ్‌లో స్పందించారు. వేదికపై చాలా సహజంగా కనిపించిందని రాసుకున్నారు. తనని చూస్తుంటే చాలా సంతోషంగా, గర్వంగా అనిపించిందని కూడా రాసారు. ఆరాధ్య చిన్నతనంలో నెటిజన్ల నుండి అనేక ట్రోల్స్ ఎదుర్కుంది. ప్రస్తుతం ఆరాధ్యను చూస్తుంటే ట్రోల్స్ చేసిన వారందరికి త్వరలోనే గట్టి సమాధానం ఇచ్చేలా కనిపిస్తోంది.

Manchu Lakshmi : మంచులో బికినీలో మంచులక్ష్మి స్నానం.. వైరల్ అవుతున్న వీడియో..

ఐశ్వర్య-అభిషేక్ ఉమ్రావ్ జాన్, గురు, కుచ్ నా కహో, రావణ్ సినిమాల్లో కలిసి నటించారు. ఏప్రిల్ 20, 2007 లో ఒకటైన ఈ జంటకు 2011 లో ఆరాధ్య జన్మించింది. ప్రస్తుతం ఐశ్వర్య-అభిషేక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by AISHVERSE ? (@theaishverse)

 

View this post on Instagram

 

A post shared by AISHVERSE ? (@theaishverse)