Naa Saami Ranga : నాగార్జున ‘నా సామిరంగ’ టీజర్ రిలీజ్.. ఒకే సినిమాలో ముగ్గురు హీరోలు.. అదిరిపోయిన సర్‌ప్రైజ్
ఇప్పటికే రిలీజయిన గ్లింప్స్, పోస్టర్స్ చూస్తుంటే ఇది కూడా గత నాగార్జున సినిమాల్లాగే పండక్కి ఎంటర్టైన్మెంట్ లా ఉండబోతుందని తెలుస్తుంది.

Nagarjuna Naa Saami Ranga Movie Teaser Released Surprise with Allari Naresh and Raj Tarun
Naa Saami Ranga Teaser : టాలీవుడ్ మన్మథుడు నాగార్జున (Nagarjuna) కొంచెం గ్యాప్ తీసుకోని ఈ సంక్రాంతికి ‘నా సామిరంగ’ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో కన్నడ భామ ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) హీరోయిన్ గా నటిస్తుంది.
డ్యాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా మారి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజయిన గ్లింప్స్, పోస్టర్స్ చూస్తుంటే ఇది కూడా గత నాగార్జున సినిమాల్లాగే పండక్కి ఎంటర్టైన్మెంట్ లా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ ఉన్నాడని రెండు రోజుల క్రితమే సర్ ప్రైజ్ ఇచ్చి ఇవాళ సినిమా టీజర్ రిలీజ్ చేసి సినిమాలో ఇంకో హీరో రాజ్ తరుణ్ కూడా ఉన్నాడని మరో సర్ ప్రైజ్ ఇచ్చారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Manchu Lakshmi : మంచులో బికినీలో మంచులక్ష్మి స్నానం.. వైరల్ అవుతున్న వీడియో..
ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ కి మిర్నా మీనన్ జంటగా నటిస్తుంది. మరి రాజ్ తరుణ్ కి జంటగా ఎవరున్నారో చూడాలి. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. టీజర్ లోనే నాగార్జునకి ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చారు. కొంచెం కామెడీ, లవ్ సీన్స్ కూడా ఉన్నాయి. దీంతో పండక్కి ఈ సారి కూడా నాగార్జున హిట్ కొట్టేస్తాడని భావిస్తున్నారు.