1947లో వాళ్లకి తాతయ్య, నాన్నమ్మలుగా..

  • Published By: sekhar ,Published On : August 27, 2020 / 01:54 PM IST
1947లో వాళ్లకి తాతయ్య, నాన్నమ్మలుగా..

Updated On : August 27, 2020 / 2:45 PM IST

John, Aditi from Cross Border Love Story: బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్, హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా కాశ్వీ నాయర్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. జాన్ అబ్రహం, అదితిరావు హైదరీ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా వాళ్ల ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. ఈ కథ 1947 కాలంలో జరుగుతుందని, స్వాతంత్ర్య నేపథ్యంతో ముడిపడిన అద్భుతమైన ప్రేమకథగా రూపొందిస్తున్నామని చిత్ర బృందం తెలిపింది.



జాన్ అబ్రహం, అదితీలు అర్జున్ కపూర్‌కి తాతయ్య, నానమ్మలుగా కనిపించనున్నారని తెలిపారు. ఫస్ట్‌లుక్ పోస్టర్లో జాన్ తలపాగాతో కనిపిస్తుండగా అదితి.. పాస్టెల్ కుర్తా, షరారాలో ఆలివ్ గ్రీన్ దుప్పట్టాలో ఆకట్టుకుంటోంది.
https://10tv.in/sp-balasubrahmanyam-health-update-from-his-son-sp-charan/
‘‘1946-47 కాలంలో ఓ జంటగా జాన్, నేను నటిస్తున్నాం. అసంపూర్తిగా మిగిలిన వాళ్ల ప్రేమకథను సుఖాంతం చేసే యువకుడి పాత్రలో అర్జున్ కపూర్ నటిస్తున్నాడు. ఇలాంటి కథలు ఈమధ్య కాలంలో రావడం చాలా తక్కువ. ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది’’ అంటూ అదితీరావు ట్వీట్ చేసింది. త్వరలో టైటిల్‌తో పాటుగా హీరో హీరోయిన్ల లుక్ రిలీజ్ చేస్తామని యూనిట్ సభ్యులు తెలిపారు.



John Abraham-AditiRao Hydari