బాలయ్య చేతుల మీదుగా ‘సెహరి’ ఫస్ట్‌లుక్

Sehari First Look: టాలీవుడ్‌కి హర్ష్ కానుమిల్లి అనే కొత్త హీరో పరిచయమవుతున్నాడు. సిమ్రన్ చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా జ్ఞానసాగర్ ద్వారక దర్శకుడిగా పరిచయమవుతున్నారు.. విర్గో పిక్చర్స్ బ్యానర్‌పై శిల్పా చౌదరి, అద్వయ జిష్ణు రెడ్డి నిర్మిస్తున్నారు. హర్ష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను నటసింహా నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు.
ఈ సినిమాకు ‘సెహరి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. హర్ష్ హీరోగా నటించడంతో పాటు రచన కూడా చేయడం విశేషం. హర్ష్ కష్టపడి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలంటూ బాలయ్య అతనికి ఆశీస్సులు అందించి.. చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు.
https://10tv.in/ammoru-thalli-movie-review/
త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, వచ్చే ఏడాదిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతికనిపుణుల వివరాలు కొద్దిరోజుల్లో తెలియజేయనున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : సురేష్ సారంగం, ఎడిటింగ్ : రవితేజ గిరిజాల.