సిద్దార్థ్ మల్హోత్రా ‘షేర్ షా’ ఫస్ట్ లుక్

కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘షేర్ షా’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : January 16, 2020 / 06:21 AM IST
సిద్దార్థ్ మల్హోత్రా ‘షేర్ షా’ ఫస్ట్ లుక్

Updated On : January 16, 2020 / 6:21 AM IST

కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘షేర్ షా’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్..

బాలీవుడ్‌తో పాటు తెలుగు, తమిళ్ భాషల్లోనూ గతకొంత కాలంగా బయోపిక్స్, రియల్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకుని తీసే సినిమాలు చక్కటి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఆ కోవలోనే కార్గిల్ వార్‌లో చురుకుగా పాల్గొని, పరమ వీరచక్ర బిరుదు అందుకున్న ఆర్మీ ఆఫీసర్, కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా.. ‘షేర్ షా’ అనే సినిమా రూపొందుతుంది.

Image

విష్ణు వర్థన్ డైరెక్షన్లో, ప్రతిష్టాత్మక ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, కరణ్ జోహార్, హీరూ జోహార్, అపూర్వ మెహతా, షబ్బీర్ బాక్స్ వాలా, అజయ్ షా, హిమాన్షు గాంధీ కలిసి నిర్మిస్తున్నారు. సిద్దార్థ్ మల్హోత్రా కెప్టెన్ విక్రమ్ బాత్రా క్యారెక్టర్ చేస్తుండగా, కైరా అద్వాణీ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ‘షేర్ షా’ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు.

Image

విక్రమ్ బాత్రాగా మిలటరీ గెటప్‌లో సిద్దార్థ్ చక్కగా సూట్ అయ్యాడు. విక్రమ్‌ను పాకిస్థాన్ ఆర్మీ వాళ్లు ‘షేర్ షా’ అని పిలిచే వాళ్లు.. అందుకోసమే ఆయన బయోపిక్‌కి ఈ టైటిల్ పెట్టినట్టున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ‘షేర్ షా’.. 2020 జూలై 3న విడుదల కానుంది.

Image