కొత్త అవతారం : ఫస్ట్ టైమ్ నటించనున్న వర్మ

  • Published By: veegamteam ,Published On : April 7, 2019 / 11:50 AM IST
కొత్త అవతారం : ఫస్ట్ టైమ్ నటించనున్న వర్మ

Updated On : April 7, 2019 / 11:50 AM IST

రాంగోపాల్ వర్మ.. సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. సంచలన, వివాదాస్పద సినిమాలకు కేరాఫ్ అడ్రస్. వర్మ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. నిర్మాతగా సత్తా చూపాడు. దీనికి తోడు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా.. సింగర్ గా నిరూపించుకున్నాడు. ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తనున్నాడు. లైఫ్ లో ఫస్ట్ టైమ్ మేకప్ వేసుకోనున్నాడు. యాక్టింగ్ చేసేందుకు రెడీ అయ్యాడు.

ఇప్పటివరకు తెర వెనుక స్టార్ట్, కెమెరా, యాక్షన్ అంటూ నటీనటులను డైరెక్ట్ చేసిన రాంగోపాల్ వర్మ.. తొలిసారి ముఖానికి మేకప్ వేసుకోనున్నాడు. గన్‌షాట్ ఫిలింస్ అనే సంస్థ తొలి ప్రయత్నంగా ‘కోబ్రా’ అనే చిత్రాన్ని తెరకెక్కించబోతుంది. ఈ సినిమా ద్వారా వర్మ నటుడిగా వెండితెరకు పరిచయం కానున్నాడు. ఈ సినిమాను ఆర్జీవీనే డైరెక్ట్ చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఆదివారం(ఏప్రిల్ 7,2019) వర్మ పుట్టిన రోజు. దీంతో గన్ షాట్ ఫిలింస్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. వర్మ నటించనున్నాడు అనే వార్త ఆయన అభిమానుల్లో ఆసక్తి నింపింది. ఎప్పుడెప్పుడు వర్మను తెరపై చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ గా ఇరగదీసిన వర్మ.. యాక్టర్ గా అదిరిపోయే పెర్ఫార్మెన్ ఇవ్వడం ఖాయం అని ఫ్యాన్స్ అంటున్నారు.