Krithishetty
Young Heroins : ఇటీవల సినీ పరిశ్రమకి కొత్త హీరోయిన్స్ చాలా మంది వస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా ఎక్కడి నుంచో వచ్చి మరో చోట సినిమాల్లో తమ అందంతో, తమ అభినయంతో మెప్పిస్తున్నారు హీరోయిన్స్. తెలుగు, తమిళ్ లో గత కొద్ది కాలంగా బాగా పేరు తెచ్చుకున్న హీరోయిన్స్, యంగ్ భామలు.. సాయి పల్లవి, కృతి శెట్టి, కళ్యాణి ప్రియ దర్శిని, ప్రియాంక అరుల్ మోహన్.
ఈ నలుగురు హీరోయిన్స్ వారుఇసా సినిమాలతో మెప్పిస్తూ టాలీవుడ్, కోలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుని, అభిమానుల్ని కూడా సంపాదించుకున్నారు. తాజాగా తమిళ్ లో జరిగిన బిహైండ్ వుడ్ అవార్డ్స్ ఫంక్షన్ లో ఈ నలుగురు కలిశారు. ఇంకేముంది ఈ యువ హీరోయిన్స్ తమ ఫోన్స్ కి పని చెప్పారు. ప్రియాంక మోహన్ తన ఫోన్ లో ఈ నలుగురితో కలిపి సెల్ఫీ తీసింది. ఆ సెల్ఫీని కళ్యాణి ప్రియదర్శన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటో షేర్ చేసి వన్ ఫోటో టు రూల్ దెమ్ ఆల్.. అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.
Bindu Madhavi : బాలయ్య సినిమాలో బిగ్‌బాస్ విన్నర్
ఇలా ఇటీవల కాలంలో పేరు తెచ్చుకున్న నలుగురు అందమైన భామలు, తమ ఫేవరేట్ హీరోయిన్స్ ఒకే ఫ్రెమ్ లో కనపడటంతో అభిమానులు, నెటిజన్లు ఈ ఫోటోని విపరీతంగా షేర్ చేసి వైరల్ చేస్తున్నారు. మొత్తానికి ఇలా నలుగురు భామలు ఒకే ఫొటోలో కనపడి యువకుల హృదయాల్ని కొల్లగొడుతున్నారు.
One photo to rule them all ???@priyankaamohan @IamKrithiShetty @Sai_Pallavi92 pic.twitter.com/5aGDEh0kKh
— Kalyani Priyadarshan (@kalyanipriyan) May 22, 2022