Drugs Case : డ్రగ్స్ కేసు : హీరోయిన్ల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. FSL రిపోర్టులో అసలు నిజాలు!

కన్నడ డ్రగ్స్ కేసులో హీరోయిన్లకు ఉచ్చు బిగుసుకుంటోంది. కన్నడ హీరోయిన్లలో సంజన, రాగిణిలు డ్రగ్స్ తీసుకున్నట్టు FSL రిపోర్టులో తేలింది.

Drugs Case : డ్రగ్స్ కేసు : హీరోయిన్ల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. FSL రిపోర్టులో అసలు నిజాలు!

Drugs Case

Updated On : August 24, 2021 / 3:59 PM IST

Drugs Case :  కన్నడ డ్రగ్స్ కేసులో హీరోయిన్లకు ఉచ్చు బిగుసుకుంటోంది. కన్నడ హీరోయిన్లలో సంజన, రాగిణిలు డ్రగ్స్ తీసుకున్నట్టు FSL రిపోర్టులో తేలింది. కన్నడ చిత్ర పరిశ్రమలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి గత ఏడాదిలో అరెస్టయిన వారిలో కొందరు డ్రగ్స్ సేవించినట్టు నిర్ధారించినట్లు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది.

డ్రగ్స్ కేసులో అరెస్టయిన వారిలో కన్నడ సినీనటులు సంజన గల్రాణి, రాగిణి ద్వివేది, పార్టీ ఆర్గనైజర్ వీరెన్ ఖన్నా సహా పలువురు ఉన్నారు. 2020 అక్టోబర్ నెలలో ఇద్దరి వెంట్రుక నమూనాలను FSL ఫోరెన్సిక్‌కు బెంగళూరు పోలీసులు పంపారు. ఆ రిపోర్టులో సంజన, రాగిణి డ్రగ్స్ సేవించినట్టు తేలింది.

ముందుగా వీరికి బ్లడ్, యూరిన్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపారు. ఆ శాంపిల్స్ లో ఫలితం సరిగ్గా తేలలేదు. దాంతో వారిద్దరి నుంచి వెంట్రుకల నమూనాలను పోలీసులు సేకరించారు. హీరోయిన్ల నమూనాలను హైదరాబాద్ ఎఫ్ఎస్ఎల్‌కు పంపించారు. వాటిలో రాగిణి, సంజనలు డ్రగ్స్ తీసుకున్నట్లు రిపోర్టు వచ్చింది. దీంతో మరోసారి ఇద్దరికీ బెంగుళూరు పోలీసులు సమన్లను జారీ చేయనున్నారు.

పదినెలల విచారణ అనంతరం వీరు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్దారించారు. బెంగళూరు పోలీసులు మాదకద్రవ్యాల కేసుల దర్యాప్తులో వేగంగా, నిష్పక్షపాతంగా పని చేశారని బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ అన్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో నమోదైన కేసులో పురోగతి లభించిందని తెలిపారు. సీసీబీ ద్వారా విచారణ బృందం కష్టపడి సేకరించిన సాక్ష్యాల ఫలితంగా హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నుంచి సానుకూల నివేదిక వచ్చిందన్నారు.

ఇప్పటికే కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశామన్నారు. ఈ విషయంలో ప్రస్తుతానికి ఏం చెప్పలేమన్నారు. కానీ, కొంతమంది వ్యక్తులు డ్రగ్స్ తీసుకునేవారని FSL నివేదిక రుజువు చేసింది. నిందితుల జుట్టు నమూనాలను సేకరించి టెస్టుల కోసం హైదరాబాద్‌కు పంపినట్టు తెలిపారు. ఇప్పుడు వచ్చిన నివేదికలో వారిద్దరూ డ్రగ్స్ చేస్తున్నట్లు నిర్ధారణ అయిందన్నారు. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులతో పాటు, కొంతమంది ఆఫ్రికన్ జాతీయులు కూడా అరెస్టు అయ్యారు.

నిందితులకు సమాచారాన్ని లీక్ చేస్తున్న కొంతమంది పోలీసు అధికారులను కూడా విచారణ సమయంలో సస్పెండ్ చేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మహమ్మద్ అనూప్, రిజేష్ రవీంద్రన్ అనిఖా దినేష్ 2020 ఆగస్టులో మాదకద్రవ్యాలను తీసుకున్నారనే ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. ఈ ముగ్గురు కన్నడ చిత్ర పరిశ్రమలోని వ్యక్తులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని తెలిపింది.