G V Prakash Kumar : ట్రైబల్స్‌ని థియేటర్‌లోకి అనుమతించని యజమాన్యం.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సీరియస్ ట్వీట్!

శింబు (Simbu) సినిమా చూడడానికి వచ్చిన ట్రైబల్స్ ని థియేటర్ యాజమాన్యం లోపలికి అనుమతించలేదు. దీని పై తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జి వి ప్రకాష్ (G. V. Prakash Kumar) సీరియస్ ట్వీట్ చేశాడు.

G V Prakash Kumar : ట్రైబల్స్‌ని థియేటర్‌లోకి అనుమతించని యజమాన్యం.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సీరియస్ ట్వీట్!

G V Prakash Kumar serious tweet on chennai tribals issue simbu Pathu Thala

Updated On : March 30, 2023 / 2:15 PM IST

G V Prakash Kumar : తమిళనాడు చెన్నైలోని (Chennai) ఒక ప్రముఖ థియేటర్ లో ఈరోజు (మార్చి 30) ఉదయం ఒక సంఘటన జరిగింది. తమిళ స్టార్ హీరో శింబు (Simbu) ‘పత్తు తల’ నేడు విడుదలైంది. ఈ సినిమా చూసేందుకు అభిమానులతో పాటు చాలా మంది సినీ ప్రేక్షకులు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే సంచార జాతి నరిక్కువర్ వర్గానికి చెందిన ట్రైబల్స్ కూడా ఈ సినిమా చూడడానికి వచ్చారు. అందరి లాగానే సినిమా చూసేందుకు వారు కూడా డబ్బులు పెట్టి మార్నింగ్ షోకి టికెట్ కొనుక్కున్నారు. ఇక సినిమా చూడడానికి లోపాలకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే అక్కడి థియేటర్ మేనేజ్మెంట్ వారిని ఆపేసింది.

NTR30 : శ్రీరామనవమి కానుకగా NTR30 అప్డేట్ ఇచ్చిన కళ్యాణ్ రామ్..

వారికీ లోపలికి ప్రవేశం లేదంటూ, వారిని వెనక్కి వెళ్ళిపోమంటూ అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఇక ఈ విషయాన్ని చూసిన శింబు అభిమానులు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. చెన్నై లాంటి సిటీల్లో కూడా ఇలాంటి అంటరానితనం ఏంటని ట్వీట్ చేశారు. ఇది గంటల వ్యవధిలోనే వైరల్ అయ్యి తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జి వి ప్రకాష్ (G V Prakash Kumar) వరకు చేరుకుంది. ఇది చూసిన జి వి స్పందిస్తూ.. ”సినిమా, కళ అనేవి అందరికి సొంతం. అవి అందరికి సమానమే. టికెట్స్ ఉన్నా వారిని థియేటర్ లోకి రానివ్వకపోవడం సరికాదు. వారిని కూడా సినిమా చూడడానికి అనుమతించాలి” అంటూ ట్వీట్ చేశాడు.

Chatrapathi Remake : బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి టీజర్ లీక్.. సూపర్ అంటున్న నెటిజెన్లు!

ఇక విషయం సీరియస్ అవుతుండడంతో థియేటర్ యాజమాన్యం వారిని తరువాత షోకి అనుమతించి సినిమా చూపించింది. వారందరు సినిమా చూస్తున్న వీడియోని పోస్ట్ చేస్తూ.. జరిగిన సంఘటన పై వివరణ ఇచ్చారు. ”పత్తు తల సినిమాకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. వచ్చిన ట్రైబల్ కుటుంబంలో 2,6,8,10 వయసులకు సంబంధించిన పిల్లలు ఉన్నారు. వారిని మాత్రమే అనుమతించడానికి నిరాకరించాం. అసలు అక్కడ ఏమి జరిగిందో తెలుసుకోకుండా అభిమానులు వేరే కోణంలో ఆ వీడియోని పోస్ట్ చేశారు” అంటూ చెప్పుకొచ్చింది.