Ram Charan : రామ్ చరణ్ కి గాయం..? అందుకే గేమ్ ఛేంజర్ మళ్ళీ వాయిదా..?
దిల్ రాజు సంస్థ నుంచి అధికారికంగా.. సెప్టెంబర్ లో కొంతమంది ఆర్టిస్టుల డేట్స్ లేక ఆ షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యినట్లు, ఆ షెడ్యూల్ షూట్ ని అక్టోబర్ సెకండ్ వీక్ కి మార్చినట్లు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. కానీ రామ్ చరణ్ సన్నిహితుల సమాచారం ప్రకారం..

Game Changer Movie Shoot Postpone due to Ram Charan Injured News goes viral
Ram Charan Game Changer : రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ శంకర్(Director Shankar) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా కోసం చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే అనేక కారణాలు వల్ల ఈ సినిమా లేట్ అవుతూ వస్తుంది. మెగా అభిమానులు ఈ సినిమా నుంచి కనీసం అప్డేట్ కూడా లేదని తీవ్ర నిరాశ చెందుతున్నారు.
అయితే శంకర్ ఇండియన్ 2 షూటింగ్ అయిపోవడంతో చరణ్ కూడా రెడీగా ఉండటంతో సెప్టెంబర్ లో యాక్షన్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. కానీ ఆ షెడ్యూల్ కూడా క్యాన్సిల్ అయి గేమ్ ఛేంజర్ సినిమా షూట్ మళ్ళీ వాయిదా పడింది. అయితే నిన్నే దీనిపై దిల్ రాజు సంస్థ నుంచి అధికారికంగా.. సెప్టెంబర్ లో కొంతమంది ఆర్టిస్టుల డేట్స్ లేక ఆ షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యినట్లు, ఆ షెడ్యూల్ షూట్ ని అక్టోబర్ సెకండ్ వీక్ కి మార్చినట్లు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.
కానీ రామ్ చరణ్ సన్నిహితుల సమాచారం ప్రకారం.. రామ్ చరణ్ కి చిన్న గాయం అయిందని, దానికి మేకప్ వేసి కవర్ చేయలేరని, అందులోనూ యాక్షన్ సీక్వెన్స్ ఉంది కాబట్టి ఇబ్బంది అవుతుందని డాక్టర్ ప్రస్తుతం షూటింగ్ కాకుండా రెస్ట్ తీసుకోమని చెప్పినట్టు తెలుస్తుంది. కనీసం ఒక 10 రోజులు రెస్ట్ తీసుకోమని డాక్టర్ చరణ్ కి చెప్పినట్టు సమాచారం. అందుకే ప్రస్తుతం జరగాల్సిన యాక్షన్ షెడ్యూల్ వాయిదా పడినట్లు తెలుస్తుంది. దీంతో అభిమానులు మరోసారి నిరుత్సాహ పడుతున్నారు. చరణ్ కి గాయం అయిందని వార్తలు వస్తుండటంతో అభిమానులు కంగారుపడుతూ త్వరగా రికవరీ అయి షూట్ కి రావాలని కోరుకుంటున్నారు. అక్టోబర్ రెండో వారంలో ఎలాగైనా గేమ్ ఛేంజర్ సినిమా షూట్ మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది.
Also Read : Kangana Ranaut : పోకిరి సినిమా నేను చేయాలి.. పూరి జగన్నాద్ సెలెక్ట్ చేశారు.. కానీ..
ఇక ఈ సినిమాలో చరణ్ తండ్రి కొడుకు పాత్రలు పోషించనున్నట్టు తెలుస్తుంది. చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి నటించనున్నారు. శ్రీకాంత్, సునీల్, SJ సూర్య, నవీన్ చంద్ర, సముద్రఖని, అనన్య.. మరికొంతమంది పలువురు ప్రముఖులు నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా భారీ బడ్జెట్ తో గేమ్ ఛేంజర్ సినిమాని తెరకెక్కిస్తున్నారు దిల్ రాజు.