Game Changer Trailer Breaks Records with 180 Million Views
Game Changer Trailer : గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ బాషల్లోనూ రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
యూట్యూబ్‌లో ఈ ట్రైలర్ దూసుకుపోతుంది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో అన్ని భాషల్లో కలిసి 180 ఫ్లస్ మిలియన్స్ వ్యూస్ తో దుమ్ములేపుతోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఓ సరికొత్త పోస్టర్ ద్వారా తెలియజేసింది. ఇందులో గుర్రం కంటే వేగంగా రామ్‌చరణ్ పరిగెడుతున్నట్లుగా ఉంది. ఇప్పటికే గేమ్ ఛేంజర్ పై భారీ అంచనాలే ఉండగా.. ట్రైలర్‌తో ఆ అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
Dilruba Teaser : కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా’ టీజర్ వచ్చేసింది..
ఇక నేడు రాజమండ్రిలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయి. సాయంత్రం జరగనున్న ఈ వేడుకకు ఇప్పటి నుంచే అభిమానులు వేదిక వద్దకు చేరుకుంటున్నారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. దీంతో రాజమండ్రితో పాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి మెగా అభిమానులు పెద్ద ఎత్తున ఈ వేడుకకు రానున్నారు.
ఈ చిత్రాన్ని శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మించారు. అంజలి, శ్రీకాంత్, ఎస్‌జే సూర్య తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
180 Million💥
Stupendous. Like no other, like never before!🔥
The most talked about, the #GameChangerTrailer✨
🔗 https://t.co/aVIW0HqfLl#GameChanger#GameChangerOnJAN10 🚁Global Star @AlwaysRamCharan @shankarshanmugh @advani_kiara @yoursanjali @iam_SJSuryah @MusicThaman… pic.twitter.com/CyRnwGxj6R
— Sri Venkateswara Creations (@SVC_official) January 4, 2025