Chiru – Pawan : తమ్ముడి కోసం వెనక్కి తగ్గిన అన్నయ్య..

టాలీవుడ్‌లో కొత్త సినిమాల సందడి ఏమోగాని, పాత సినిమాల సందడి మాత్రం జోరుగా ఉంది. స్టార్ హీరోల ఒకప్పటి సినిమాలను రీ రిలీజ్ చేసి సందడి చేస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే ఈ న్యూ ఇయర్ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి ట్రెండ్‌సెట్ మూవీ 'గ్యాంగ్ లీడర్'ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే

Chiru – Pawan : తమ్ముడి కోసం వెనక్కి తగ్గిన అన్నయ్య..

gang leader movie postponed

Updated On : December 21, 2022 / 11:45 AM IST

Chiru – Pawan : టాలీవుడ్‌లో కొత్త సినిమాల సందడి ఏమోగాని, పాత సినిమాల సందడి మాత్రం జోరుగా ఉంది. పాన్ ఇండియా సినిమాలు అంటూ ఇండస్ట్రీలో మోడరన్ కథలతో సినిమాలు తెరకెక్కుతుండడంతో.. తమ వింటేజ్ హీరోలను మిస్ అవుతున్నారు అభిమానాలు. దీంతో తమ అభిమాన హీరోల ఒక్కప్పటి సినిమాలను మళ్ళీ రీ రిలీజ్ చేసి ఆ వింటేజ్ ఫీల్ ని ఎంజాయ్ చేస్తున్నారు. రీ రిలీజ్‌లకు మంచి ఆదరణ లభిస్తుండడంతో మేకర్స్ కూడా సినిమాను హై క్వాలిటీతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Mega Family : సీక్రెట్ శాంటా కోసం గ్యాంగ్ అప్ అయిన మెగా ఫ్యామిలీ..

ఈ క్రమంలోనే ఈ న్యూ ఇయర్ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి ట్రెండ్‌సెట్ మూవీ ‘గ్యాంగ్ లీడర్’ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే న్యూ ఇయర్ వేడుకలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సందడి చేయడానికి సిద్దమయ్యాడు. పవన్ అల్ టైమ్ సూపర్ హిట్ మూవీ ‘ఖుషి’ని డిసెంబర్ 31న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. దీంతో తమ్ముడి కోసం అన్నయ్య వెనక్కి తగ్గి రూట్ క్లియర్ చేశాడు.

మెగా ఫ్యామిలీ నుంచి ఒకే రోజు రెండు సినిమాలు విడుదల కావడం సరి కాదని, ‘గ్యాంగ్ లీడర్’ని పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. కాగా ఖుషి రీ రిలీజ్ ఇప్పటికే చాలా సార్లు పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. ఈ క్రమంలోనే మరోసారి వెనక్కి తగ్గడం భావ్యం కాదని ఖుషికి లైన్ క్లియర్ చేస్తూ గ్యాంగ్ లీడర్ తప్పుకుంది. త్వరలోనే గ్యాంగ్ లీడర్ కొత్త రిలీజ్ డేట్ ని తెలియజేస్తామని వెల్లడించారు నిర్వాహకులు.