ఒళ్లు గగుర్పొడిచే ‘గర్జన’ టీజర్
శ్రీరామ్, రాయ్ లక్ష్మీ జంటగా.. జె.పార్థిబన్ దర్శకత్వంలో రూపొందుతున్న థ్రిల్లర్ ‘గర్జన’ టీజర్ విడుదల..

శ్రీరామ్, రాయ్ లక్ష్మీ జంటగా.. జె.పార్థిబన్ దర్శకత్వంలో రూపొందుతున్న థ్రిల్లర్ ‘గర్జన’ టీజర్ విడుదల..
శ్రీరామ్, రాయ్ లక్ష్మీ జంటగా.. జె.పార్థిబన్ దర్శకత్వంలో జాగ్వార్ స్టూడియోస్ పతాకంపై తెరకెక్కుతున్న థ్రిల్లర్ మూవీ ‘గర్జన’. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. కొత్తగూడెం తూర్పు అటవీ ప్రాంతంలో 45 ఏళ్ల వ్యవసాయ కూలీని పులి చంపిందనే వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అయిన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
ఆ పులిని పట్టుకునే అటవీ అధికారిగా శ్రీరామ్, అతని భార్యగా రాయ్ లక్ష్మీ కనిపించారు. టీజర్‌లో పులి షాట్స్ చూస్తే వణుకు వచ్చేలా ఉన్నాయి. దేవ్ గిల్, నైరా, వషన్ని, ఆరోహి తదితరులు కీలకపాత్రల్లో నటించారు.
విజువల్స్, ఆర్ఆర్ చక్కగా కుదిరాయి. త్వరలో ‘గర్జన’ ప్రేక్షకుల ముందుకు రానుంది. మ్యూజిక్ : అరుల్‌దేవ్, ఎడిటింగ్ : ఆర్.సుదర్శన్, స్టోరీ, స్క్రీన్‌ప్లే అండ్ సినిమాటోగ్రఫీ : ఎమ్.వి.పన్నీర్ సెల్వం.