Solo Boy : సినిమా చూసిన ఒక పెద్దావిడ ఒక మంచి సినిమా చూసా అంది.. బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ..

సోలో బాయ్ సినిమా నిన్న జులై 4 థియేటర్స్ లో రిలీజవ్వగా మూవీ యూనిట్ థ్యాంక్యూ మీట్ నిర్వహించారు.

Solo Boy : సినిమా చూసిన ఒక పెద్దావిడ ఒక మంచి సినిమా చూసా అంది.. బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ..

Updated On : July 5, 2025 / 7:55 PM IST

Solo Boy : సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సతీష్ నిర్మాణంలో నవీన్ కుమార్ దర్శకత్వంలో బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కిన సినిమా సోలో బాయ్. రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్స్ గా నటించగా పోసాని కృష్ణమురళి, అనిత చౌదరి, షఫీ.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. సోలో బాయ్ సినిమా నిన్న జులై 4 థియేటర్స్ లో రిలీజవ్వగా మూవీ యూనిట్ థ్యాంక్యూ మీట్ నిర్వహించారు.

ఈ ఈవెంట్లో డైరెక్టర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ… సోలో బాయ్ చిత్రాన్ని సోల్ ఫుల్ గా హిట్ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. మంచి కంటెంట్ ఉన్న సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తే ఎంతగా ఆదరిస్తారో మరోసారి నిరూపించారు. నిర్మాతగా ముందుకు వచ్చిన సతీష్ గారికి ముందు ముందు మరింత లాభాలు వచ్చి ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

Also Read : Virgin Boys : బిగ్ బాస్ మిత్ర శర్మ ‘వర్జిన్ బాయ్స్’ ట్రైలర్ రిలీజ్.. సినిమా చూస్తే లక్కీ విన్నర్స్ కి ఐ ఫోన్స్ గిఫ్ట్..

నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ మాట్లాడుతూ… సోలో బాయ్ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మౌత్ టాక్ ద్వారా సినిమాను ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ సినిమా మొదలైన రెండు సంవత్సరాల తర్వాత అదే తేదీన థాంక్యూ మీట్ జరగడం అనేది యాదృచ్ఛికమని చెప్పుకోవాలి. భవిష్యత్తులో కూడా మంచి సినిమాలు మాత్రమే చేస్తాను అని తెలిపారు.

నటుడు గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ… నిన్న సినిమా చూసిన ఒక పెద్దావిడ ఒక మంచి సినిమా చూసా అని చెప్పిన వీడియో చూసాక నేను చాలా సంతోషించాను. ఒక మంచి సినిమా చూశాను అనే ఫీల్ తో ప్రేక్షకులు బయటకు వస్తుంటే అది తెలిసి నాకు ఎంతో ఎమోషనల్ గా అనిపించింది అని చెప్పారు.

Also Read : Allu Arjun : అమెరికాలో అడుగు పెట్టిన అల్లు అర్జున్.. లుక్ అదిరిందిగా.. ఫొటోలు వైరల్..