Gayathri Gupta : నా ఆరోగ్యం బాగోలేదు.. డబ్బులు లేవు.. విరాళాలు అడగలనుకుంటున్నా.. పాపం ఆ నటి పరిస్థితి..
సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉండే గాయత్రి గుప్తా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్యంపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

Gayathri Gupta sensational comments about her health she wants try crowd funding
Gayathri Gupta : పలు షార్ట్ ఫిలిమ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న నటి గాయత్రి గుప్తా ఆ తర్వాత సినిమాల్లో కూడా నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో చాలా బోల్డ్ గా ఫొటోలు, వీడియోలు, కొటేషన్స్ పోస్ట్ చేస్తూ బోల్డ్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా చెయ్యకపోయినా కొన్ని సినిమాల్లో బోల్డ్ క్యారెక్టర్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి పాపులర్ అయింది.
సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉండే గాయత్రి గుప్తా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్యంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ఇంటర్వ్యూ ప్రోమో రిలీజ్ అవ్వగా ఇందులో గాయత్రి గుప్తా మాట్లాడుతూ.. ప్రస్తుతం నా హెల్త్ కండిషన్ అస్సలు బాగోలేదు, రేపు ఏం జరుగుతుందో తెలియదు, ఆపరేషన్ చేయాలి. డబ్బులు చాలా ఎక్కువే అవుతాయి. 10 లక్షలపైనే కావాలి, కానీ నా దగ్గర అంత డబ్బులు లేవు. నా అనారోగ్యం కోసం విరాళాలు సేకరించాలి అనుకుంటున్నాను అని తెలిపింది. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
అయితే తనకు ఏం అయింది, ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చింది అనేది మాత్రం చెప్పలేదు. ఫుల్ ఇంటర్వ్యూలో ఆ డీటెయిల్స్ ఏమన్నా చెప్పిందేమో చూడాలి.