Geetha Arts : గీతా ఆర్ట్స్‌కు షాక్ ఇస్తున్న ఆ నిర్మాణ సంస్థలు.. టాలీవుడ్ లో ఏం జరుగుతుంది?
గీతా ఆర్ట్స్ అంటే భారీ బడ్జెట్ సినిమాలకు పెట్టింది పేరు. ఈ బ్యానర్లో సినిమా చేయాలని ప్రతి టెక్నిషియన్‌కు వుంటుంది. గీతా ఆర్ట్స్స్ కూడా అలానే చూసుకుంటుంది. కథలు రెడీ చేయటం దగ్గర నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాక చాలా ప్లాన్డ్గా ఉంటుంది.

Geetha Arts Allu Aravind Sensational comments on other Production Companies
Geetha Arts : టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల్లో గీతా ఆర్ట్స్ ఒకటి. మెగా కుటుంబం అండదండలే కాదు సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన సంస్థగా గీతా ఆర్ట్స్‌కు పేరు ఉంది. అదేసమయంలో సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే గీతా ఆర్ట్స్ ఎప్పుడూ కొత్త ప్రాజెక్టులతో ఇండస్ట్రీకి వెన్నుదన్నుగా నిలుస్తోంది. కానీ ఈ మధ్య గీతా ఆర్ట్స్‌కే ఝలక్ ఇచ్చేలా పలు సంస్థలు పావులు కదుపుతుందనే వార్త టాలీవుడ్లో కలకలం రేపుతున్నాయి.
గీతా ఆర్ట్స్ అంటే భారీ బడ్జెట్ సినిమాలకు పెట్టింది పేరు. ఈ బ్యానర్లో సినిమా చేయాలని ప్రతి టెక్నిషియన్‌కు వుంటుంది. గీతా ఆర్ట్స్స్ కూడా అలానే చూసుకుంటుంది. కథలు రెడీ చేయటం దగ్గర నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాక చాలా ప్లాన్డ్గా ఉంటుంది. వర్క్ సెట్స్ మీదకు వెళ్లడానికి మాత్రం కాస్త టైం తీసుకుంటుంది. ఈ టైం తీసుకోవడమే ఇప్పుడు గీతా ఆర్ట్స్ బ్యానర్‌కు పెను ప్రమాదంగా మారిందనేది ఇండస్ట్రీ టాక్. గీతా ఆర్ట్స్‌తో కమిట్ అయిన దర్శకులు, ఇతర టెక్నిషయన్లు కొత్త ప్రాజెక్టులు చేయడానికి స్కోప్ ఉండటం లేదని ఇండస్ట్రీ టాక్. అయితే గీతా ఆర్ట్స్‌కు కమిట్మెంట్ ఇచ్చినా కొత్త ప్రాజెక్టులను వదులుకోలేక కొందరు టెక్నిషియన్లు ఇతర సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నారట. అయితే ఇలా తమతో అగ్రిమెంట్ ఉంటుండగా వేరే సంస్థలతో పనిచేయడానికి ఒప్పందాలు కుదర్చుకోవడంపై గీతా ఆర్ట్స్ గుర్రుగా ఉంటుందని చెబుతున్నారు.
ఇలా తమతో ఒప్పందాలు చేసుకున్న టెక్నీషియన్లు ఇతర సంస్థల్లో పనిచేయడంపై గీతా ఆర్ట్స్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కూడా నేరుగా బయటపెట్టేశారు. ఆ మధ్య గీత గోవిందం డైరెక్టర్ పరుశరాం తమతో అగ్రిమెంట్ ఉండుండగానే వేరే ప్రాజెక్టును ఒప్పుకున్నారని బహిరంగంగా చెప్పిన అరవింద్ తాజాగా ఓ ఈవెంట్ లో మైత్రీ మూవీ మేకర్స్‌పై సెటైర్లు వేసి తమ టెక్నీషియన్లను లాక్కుపోతున్నారని అన్నారు.
అరవింద్ వంటి నిర్మాత మైత్రి మూవీ మేకర్స్‌పై అలా కామెంట్ చేయడానికి ఓ ఇంట్రస్టింగ్ అంశం ఉందని చెబుతున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న చందు మొండేటితో గీతా ఆర్ట్స్ నాలుగైదు సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తోంది. ముందుగా అక్కినేని నాగ చైతన్యతో మూవీకి వర్క్ చేస్తోంది. ఈ వర్క్ ప్రాగ్రెస్లో ఉండగానే చందూ మొండేటితో మూవీ చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తోందట. గీత గోవిందం డైరెక్టర్ ఇచ్చిన ఝలక్‌తో ఇప్పటికీ తేరుకోని అరవింద్ మైత్రీ మూవీ మేకర్స్ ప్రయత్నాలను జీర్ణించుకోలేకపోయారట. ఆ విషయాన్ని మనసులో కూడా దాచుకోకుండా ఓ సినిమా ఓపెనింగ్ ఈవెంట్ లో మైత్రీ అధినేత రవి ముఖంపైనే అడిగేశారు.
సరదాగా అన్నారని చెబుతున్నా, చందూను డిస్టర్బ్ చేయొద్దు, మైత్రీ వారు అందరినీ గెలుకుతుంటారు. మాతో సినిమా చేస్తున్న చందూను డిస్టర్బ్ చేస్తే ఎలా అంటూ మీడియా సాక్షిగా సెటైర్లు వేశారు అల్లు అరవింద్. అరవింద్ ఇలా క్వశ్చన్ చేస్తారని ఊహించని మైత్రీ రవి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇప్పుడు టాలీవుడ్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. గీత గోవిందం పరుశరాం అనుభవంతో మైత్రి మూవీ మేకర్స్‌కు ముందుగానే కళ్లేం వేశారు అరవింద్. ఈ సంఘటనలతో ఇప్పటినుంచి తమ సంస్థలో సినిమా ఓకే చేసుకున్న వాళ్ళు బయటకి వెళ్లకుండా కాపాడుకునే పని కూడా పడింది అని గీతా ఆర్ట్స్ భావిస్తుంది.