Gentleman 2 : 30 ఏళ్ళ తరువాత జెంటిల్‌మెన్ సీక్వెల్.. మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్.. హీరో, దర్శకుడు ఎవరో తెలుసా..?

శంకర్, అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా 'జెంటిల్‌మెన్'. దాదాపు 30 ఏళ్ళ తరువాత ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది. ఇక ఈ సినిమాలో హీరో, దర్శకుడు ఎవరో తెలుసా..?

Gentleman 2 : 30 ఏళ్ళ తరువాత జెంటిల్‌మెన్ సీక్వెల్.. మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్.. హీరో, దర్శకుడు ఎవరో తెలుసా..?

Gentleman 2 is directed by Gokul Krishna and keeravani music

Gentleman 2 : ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన సినిమా ‘జెంటిల్‌మెన్’. కె టి కుంజుమాన్ నిర్మించిన ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ హీరో పాత్రలో నటించాడు. 1993 లో రిలీజ్ అయ్యిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. 175 రోజులకు పైగా ఆడిన ఈ సినిమా ఎన్నో అవార్డ్స్ ని కూడా అందుకుంది. దాదాపు 30 ఏళ్ళ తరువాత ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది. నిర్మాత కె టి కుంజుమాన్ ఈ సీక్వెల్ ని అధికారికంగా ప్రకటించారు.

Salman Khan : చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. సల్మాన్ ఖాన్ ప్రెస్ నోట్.. అసలు ఏమైంది..!

గత కొంతకాలంగా ఈ మూవీ స్క్రిప్ట్ పనులు జరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం శంకర్ ‘భారతీయుడు’ సీక్వెల్ ని (Indian 2) తెరకెక్కిస్తున్నాడా కదా. ఆ మూవీ తరువాత ఈ సీక్వెల్ కూడా శంకర్ డైరెక్ట్ చేయబోతున్నాడు అని మీరు అనుకుంటే పొరబడినట్లే. ఈ మూవీని శంకర్ డైరెక్ట్ చేయడం లేదు. కేవలం ఒక సినిమా అనుభవం ఉన్న దర్శకుడు ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. నేచురల్ స్టార్ నాని హీరోగా తెరెకెక్కిన ‘ఆహా కళ్యాణం’ సినిమాని డైరెక్ట్ చేసిన ఏ గోకుల్ కృష్ణ ఈ సీక్వెల్ ని డైరెక్ట్ చేస్తున్నాడట.

Vikram : దాదాపు ఐదేళ్ల తర్వాత విక్రమ్‌ స్పై యాక్షన్ మూవీకి మోక్షం..! ‘ధ్రువనక్షత్రం’ నుంచి జాన్ కమింగ్..?

అలాగే సంగీత దర్శకుడు కూడా చేంజ్ అయ్యాడు. జెంటిల్‌మెన్ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా, ఇప్పుడు ఈ సీక్వెల్ కి కీరవాణి మ్యూజిక్ చేయబోతున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన సిట్టింగ్స్ మొదలయ్యాయి అంటూ నిర్మాత తెలియజేశారు. ఇక ఈ సినిమాలో హీరోగా ఎవరు నటించబోతున్నారు అని ఆలోచిస్తున్నారా? ఆ విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు. మరి క్లాసిక్ మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు గోకుల్ కృష్ణ ఎలా హ్యాండిల్ చేయగలడో చూడాలి.