Pushpa
Pushpa: పుష్ప దూకుడు మామూలుగా లేదు. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో హ్యాట్రిక్ గా తెరకెక్కుతున్న ఈ క్రేజీ మూవీపై తగ్గేదే లేదంటున్నాడు. అసలే హ్యాట్రిక్ కాంబో.. అంతకు ముంది బన్నీ తొలి పాన్ ఇండియా సినిమా కూడా. అందుకే అభిమానులు ఎక్కడలేని అంచనాలు పెట్టేసుకున్నారు ఈ సినిమాపై. డిసెంబర్ 17న రిలీజ్ కు రెడీ అవుతున్న పుష్ప మూవీ ప్రమోషన్లు ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్తే.. తాజాగా విడుదలైన ట్రైలర్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దుమ్మురేపుతోంది.
Katrina-Vicky: కైఫ్-కౌషల్ వారి పెళ్లిసందడి.. అంతా ఓపెన్ సీక్రెట్!
సినిమా విడుదలకు మరో తొమ్మిది రోజులే ఉండడంతో యూనిట్ ప్రమోషన్స్ ను పీక్స్ తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మరో సింగిల్, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్లాన్ చేసింది. ఇప్పటికే ఈ రెండు ముహుర్తాలు పెట్టేసిన యూనిట్ త్వరలోనే వచ్చేస్తున్నాం అంటూ సోషల్ మీడియాలో అప్డేట్ ఇచ్చింది. దీంతో రాబోయే పాట ఎలా ఉండనుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిధులు ఎవరు.. ఈవెంట్ ఎప్పుడు అంటూ బన్నీ ఫ్యాన్స్ తెగ చర్చలు మొదలు పెట్టారు.
RRR Trailer: మా థియేటర్‌కి బందోబస్త్ కావాలి.. పోలీసులకు రిక్వెస్ట్ లెటర్!
ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్రత్యేక అతిధిగా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా హాజరుకానున్నాడని ప్రచారం జరుగుతుండగా.. ఇది ఎంతవరకు నిజమన్న దానితో పాటు ఈ ఈవెంట్ డేట్ కూడా త్వరలోనే ప్రకటించనుంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఈ వేడుక కోసం గ్రాండ్ ఏర్పాట్లు జరుగుతుండగా మరో సింగిల్ కూడా అక్కడే విడుదల చేస్తారా లేక ముందే చేస్తారా అన్నది కూడా త్వరలోనే ప్రకటించనున్నారు.
Bhola Shankar: చిరు జెట్ స్పీడ్.. షూట్ అప్డేట్స్ ఇచ్చిన యూనిట్!
Pre Release Event
Special Song
AnnouncementsComing Shortly.. ?
— Mythri Movie Makers (@MythriOfficial) December 8, 2021