Unstoppable With NBK: గెట్ రెడీ.. మరోసారి బాలయ్య అన్‌స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్!

బాలయ్య అంటే ఇదిరా అనేలా అభిమానులు కాలర్ ఎగరేసుకొనేలా చేసిన షో ఆహా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే. బాలయ్య హోస్ట్ ఏంటి అనే వాళ్ళ నోళ్లు మూయించేసిన ఈ షో తర్వాత బాలయ్య ఏంటో తెలియడమే కాదు..

Unstoppable With NBK: గెట్ రెడీ.. మరోసారి బాలయ్య అన్‌స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్!

Unstoppable With Nbk

Updated On : April 29, 2022 / 8:53 AM IST

Unstoppable with NBK: బాలయ్య అంటే ఇదిరా అనేలా అభిమానులు కాలర్ ఎగరేసుకొనేలా చేసిన షో ఆహా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే. బాలయ్య హోస్ట్ ఏంటి అనే వాళ్ళ నోళ్లు మూయించేసిన ఈ షో తర్వాత బాలయ్య ఏంటో తెలియడమే కాదు.. బాలయ్య క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది అనడంలో ఏమాత్రం డౌట్ అక్కర్లేదు. ఈ టాక్ షో IMDB (ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) మన దేశంలో ప్రసారమయ్యే టాక్ షోలపై నిర్వహించిన సర్వేలో 9.7 రేటింగ్‌తో తొలి స్థానంలో నిలిచింది.

Unstoppable With NBK: బాలయ్యతో మెగాస్టార్ ఎపిసోడ్.. ఎందుకు వర్క్‌ఔట్ కాలేదంటే?

ఇక ఈ షోలో ప్రతీ వారం ఎవరు గెస్ట్‌గా వస్తారనే విషయం సామాన్యులతో పాటు సెలబ్రిటీలలో కూడా ఆసక్తి కనిపించేది. అయితే.. క్రేజ్ ఉంది కదా అని సీరియల్ మాదిరి ప్రతి వారం లేకుండా సీజన్లుగా ఆహా ప్లాన్ చేసింది. తొలి సీజన్ లాస్ట్ ఎపిసోడ్ ను సూపర్ స్టార్ మహేష్ బాబుతో కంప్లీట్ చేయగా.. త్వరలోనే రెండో సీజన్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు మొదలైనట్లు తెలుస్తుంది. అన్ స్టాపబుల్ సీజన్ 2 అనగానే బాలయ్య అభిమానులలో ఒక్కసారిగా ఉత్సాహం మొదలైంది.

Unstoppable with NBK: ఫినాలే ఎపిసోడ్.. కళ్లు చెమ్మగిల్లేట్టు బాలయ్య వ్యాఖ్యలు!

కాగా, ఈ రెండో సీజన్ లో గెస్ట్స్ ఎవరు? మరీ ముఖ్యంగా తొలి గెస్ట్ ఎవరన్నదానిపై అప్పుడే చర్చలు కూడా మొదలైపోయాయి. కాగా, ఈ సారి సీజన్‌కి రాబోయే గెస్ట్ లను ఆహా టీమ్ ఫైనల్ చేసే పనిలో పడ్డారట. ఈసారి గెస్ట్ లుగా చిరంజీవి, వెంకటేష్, ప్రభాస్, తదితరులు గెస్ట్ లుగా వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఈ సారి మరింత ఎంటర్‌టైనింగ్‌గా ఈ టాక్ షో ను నడపాలని నిర్వహకులు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.