Bigg Boss Weekend Episode : వీకెండ్ ఎపిసోడ్.. సండే ఫన్ డే.. ఇంకో కొత్త పవర్ ఇచ్చిన నాగార్జున.. బిగ్ బాస్ 10 ‘డే 7’ ఫుల్ ఎపిసోడ్..
నేడు ఆదివారం నాడు నాగార్జున వినాయకచవితి స్పెషల్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చాడు. (Bigg Boss Weekend Episode)
Image Credits : Jio Hotstar Bigg Boss Show
Bigg Boss Weekend Episode : మొదటి వారంలోనే చరణ్, చైత్రలను ఎలిమినేట్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. నిన్న వీకెండ్ కావడంతో నాగార్జున ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్స్ ని వాళ్ళ తప్పులు చూపించి తిట్టేసారు. కొన్ని టాస్కులు పెట్టాడు. నేడు ఆదివారం నాడు నాగార్జున వినాయకచవితి స్పెషల్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చాడు. కాసేపు షోకి వచ్చిన ఆడియన్స్ తో మాట్లాడాడు.
ఇక హౌస్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ మొదట.. రోహిత్, షాలిని, సృష్టి లను ఎక్కువగా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నందుకు తిట్టారు నాగార్జున. అనంతరం అమన్ హౌస్ మెట్ అయినట్టు ప్రకటించారు. నిన్న హార్ట్ కి ఎవరు దగ్గరగా, ఎవరు దూరంగా ఉన్నారు అనే గేమ్ ఆడించగా మిగిలిన వాళ్ళు ఇవాళ చెప్పారు. అమన్.. దేబ్జానీ హార్ట్ కి దగ్గరగా, రామ్ ప్రసాద్ కి హార్ట్ కి దూరంగా ఉన్నారు అని చెప్పాడు. అమన్ చెప్పిన కారణాలతో రామ్ ప్రసాద్, అమన్ మధ్య గొడవ అయింది. అనంతరం రామ్ ప్రసాద్.. దేబ్జానీ హార్ట్ కి దగ్గరగా, షాలిని హార్ట్ కి దూరంగా ఉంది అని చెప్పాడు. కృష్ణుడు.. దేబ్జానీ హార్ట్ కి దగ్గరగా, రోహిత్ కి హార్ట్ కి దూరంగా ఉన్నాడని చెప్పారు. ముకేశ్.. ఝాన్సీ హార్ట్ కి దగ్గరగా, రోహిత్ హార్ట్ కి దూరంగా ఉన్నాడని చెప్పారు. నరేష్..దేబ్జానీ హార్ట్ కి దగ్గరగా, సృష్టి హార్ట్ కి దూరంగా ఉంది అని చెప్పాడు. షాలిని.. రామ్ ప్రసాద్ హార్ట్ కి దగ్గరగా, అమన్ హార్ట్ కి దూరంగా ఉన్నాడు అని చెప్పింది. సుధీర్.. ముకేశ్ హార్ట్ కి దగ్గరగా, వర్షిణి హార్ట్ కి దూరంగా ఉంది అని చెప్పాడు. వంశీ.. రోహిత్ హార్ట్ కి దగ్గరగా, సుధీర్ హార్ట్ కి దూరంగా ఉన్నాడని చెప్పారు.
Also Read : Anchor Sravanthi : షోడశ స్వర్ణగౌరీ పూజ నిర్వహించిన యాంకర్ స్రవంతి.. ఫొటోలు వైరల్..
నిన్న, ఇవాళ ఎక్కువమంది దేబ్జానీని హార్ట్ దగ్గర పెట్టుకోవాలి అని చెప్పడంతో నాగార్జున అభినందించారు. రోహిత్ ని దూరంగా ఎక్కువమంది పెట్టడంతో ఇది వార్నింగ్ బెల్. ఆట తీరు మార్చుకో అని నాగార్జున హెచ్చరించారు. అనంతరం ముకేశ్ హౌస్ మెట్ అయినట్టు ప్రకటించారు. ఆ తర్వాత బ్లాక్ కీ అనే ఒక స్పెషల్ పవర్ ఇస్తాను అని నాగార్జున చెప్పారు.
హౌస్ లోకి రాగానే 10 పవర్స్ పది మంది గెలుచుకున్నారు. అందులో ఒకటి షాలిని వాడేసింది. మిగిలిన 9 మందిలో ఆ బ్లాక్ కీ ఇచ్చి వాళ్ళ పవర్ పవర్ లేని వాళ్లకు ఇస్తామని చెప్పారు నాగ్. ఎవరికి ఇవ్వాలి అని అందర్నీ అడగడంతో సృష్టి.. కృష్ణుడు పేరు, ఝాన్సీ, రోహిత్, షాలిని, అమన్.. వర్షిణి పేరు చెప్పారు. ముకేశ్.. ఝాన్సీ పేరు చెప్పాడు. త్రిగున్, రామ్ ప్రసాద్, కృష్ణుడు, సుధీర్, వర్షిణి.. సృష్టి పేరు చెప్పారు. దేబ్జానీ.. వంశీ పేరు చెప్పింది. వంశీ.. ముకేశ్ పేరు చెప్పారు. ఎక్కువమంది సృష్టి పేరు చెప్పడంతో సృష్టికి బ్లాక్ కీ వచ్చింది. అయితే ఆ బ్లాక్ కీ పవర్ తర్వాత చేపతామన్నారు. పవర్ బాక్స్ లేని నలుగురికి గేమ్ పెట్టడంతో అందులో సుధీర్ గెలిచాడు. దాంతో సృష్టి పవర్ బాక్స్ సుధీర్ కి వెళ్ళింది.
Also See : Roopa Koduvayur : బ్లాక్ డ్రెస్ లో తెలుగమ్మాయి రూప.. అందమైన రూపంతో.. ఫొటోలు..
అనంతరం నెక్స్ట్ హౌస్ మెట్స్ సృష్టి, నరేష్ అని ప్రకటించాడు నాగార్జున. అందర్నీ రెండు రెండు టీమ్స్ గా నరేష్ ని డివైడ్ చేయమన్నాడు నాగ్. నరేష్ అందర్నీ కలిపేసి అగ్నిపరీక్ష, సెలబ్రిటీలను మిక్స్ చేసి, గొడవలు ఉన్న వాళ్ళు ఒక టీమ్ లో ఉండేలా టీమ్స్ చేసాడు. సండే ఫన్ డేలో భాగంగా డైలాగ్స్ చెప్పి మూవీ పేరుని రౌండప్ చేసే గేమ్ ఇచ్చారు. ఈ గేమ్ లో గెలిచిన వాళ్లకు స్వీట్స్ ఇచ్చాడు బిగ్ బాస్. కృష్ణుడు తన స్వీట్స్ ని ఓడిపోయినా టీమ్ కి పంచాడు. అనంతరం నెక్స్ట్ హౌస్ మెట్ గా ఝాన్సీ నిలిచింది.
దేబ్జానీ నాగార్జునని రాత్రి పూట కాఫీ కావలి బిగ్ బాస్ కి చెప్పమని అడగడంతో నీ గురించి సీక్రెట్ చెప్పమన్నాడు. చిన్నప్పుడు ఆరవ తరగతి ఫెయిల్ అయి రెండు సార్లు చదివానని చెప్పింది. అది కాకుండా హౌస్ లో ఉన్న దాని గురించి చెప్పమంటే దేబ్జానీ.. నాకు ముకేశ్ అంటే చాలా ఇష్టం అని చెప్పింది. కానీ ముకేశ్ నన్ను పట్టించుకోడు. నాకు కాఫీ ఎంత ఇష్టమో ముకేశ్ కూడా అంత ఇష్టం అని తెలిపింది. దాంతో నాగార్జున కాఫీ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు.
చివరగా మిగిలిన వర్షిణి, సుధీర్, కృష్ణుడు లను యాక్టివిటీ రూమ్ కి పిలిచి కాస్త టెన్షన్ పెట్టి ముగ్గురు హౌస్ మేట్స్ అయినట్టు తెలిపాడు. దీంతో అందరూ హౌస్ మేట్స్ అయిపోయారు. ఇక దశావతారాల్లో మొదటివారం మహాపరిక్ష అయిపోగా రెండవ వారం పవర్ ఆఫ్ పీపుల్ ఉండబోతుంది అని తెలిపాడు నాగ్. హౌస్ లో మొదటి కెప్టెన్ ఎవరు అవ్వాలనుకుంటున్నారో వాళ్లకు ఓట్ వేయమన్నారు బిగ్ బాస్.
Also See : Princce Cecil : న్యూజిలాండ్ లో పెళ్లి చేసుకున్న నటుడు.. ఫొటోలు వైరల్..
